మూడు రోజులుగా హాస్పిటల్ లోనే అమితాబ్ .. అసలేమైంది !

0

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఈ ఏజ్ లో కూడా యువహీరోలతో పోటీపడి మరీ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ మద్యే మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. ఇకపోతే బిగ్ బి కాలేయ సంబంధిత వ్యాధికి గత కొన్నిరోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

తాజాగా కాలేయ సంబంధిత వ్యాధితో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి దాటాక 2గంటల సమయంలో కొంచెం అస్వస్థతకి గురౌడం తో ఆయనని వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. గత మూడు రోజులుగా ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. . ఈ విషయంపై నానావతి ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. ఆయన రెగ్యులర్గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తమే ఇందులో చేరారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలియజేసారు దీనితో అయన అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం గులాబు సితాబ్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందిPlease Read Disclaimer