చరణ్ కు హ్యపీ బర్త్ డే వీడియో పంపిన బిగ్ బీ

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన 33 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇప్పటికే సన్నిహితులు.. ఫ్యాన్స్ హ్యాపీ బర్త్ డే మెసేజిలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అసలే పెద్ద స్టార్ హీరో కాబట్టి ఇదంతా కామనే. కానీ చరణ్ కు ఒక స్పెషల్ వ్యక్తి నుండి బర్త్ డే విషెస్ అందాయి.. అయన ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.

బిగ్ బీ ఒక వీడియో ద్వారా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో ను షేర్ చేసిన ఉపాసన “థ్యాంక్ యు సో మచ్ అమితాబ్ బచ్చన్ గారు. ఇదో స్వీటెస్ట్ గిఫ్ట్. నా చేతులు ఇంకా వణుకుతున్నాయి. ఫుల్ గా ఎగ్జైట్ అయి ఉన్నాను. #హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్. లవ్ యూ” అంటూ ట్వీ ట్ చేసింది. ఇక సీనియర్ బచ్చన్ తన వీడియోలో “చరణ్.. నేను అమితాబ్ ను. మార్చ్ 27 నీ పుట్టిన రోజు. నేను నీకు ఈరోజు.. రేపు.. నీ ఫ్యూచర్ కు అల్ ది బెస్ట్ చెబుతున్నాను. నీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ శుభాకాంక్షలు ముంబై లో ఉన్న నానుండి నా కుటుంబ సభ్యుల నుంచి నీకు అందుతున్నాయి. నువ్వు ఒక వండర్ ఫుల్ పర్సన్ చరణ్. నీకు ఇప్పుడు ఎన్నేళ్ళు వస్తున్నాయో నాకు తెలీదు. కానీ నిన్ను ఎప్పుడు చూసిన 18 ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తావు.” అన్నాడు.

అంతే కాదు.. ఇదంతా ఇంగ్లీష్ లో చెప్పిన బచ్చన్ సాబ్ చివరిగా చరణ్ నీకు మాతృభాషలో విషెస్ చెప్తాను అంటూ “చరణ్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు” అన్నాడు. బిగ్ బీ శుభాకాంక్షల వీడియోతో చరణ్ సతీమణి ఉపాసన మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ గా ఖుష్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ లో అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer