బిగ్ బి కాలేయం 75శాతం డ్యామేజ్!

0

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఊపిరితిత్తులు-గుండెతో పాటుగా లివర్ ఫంక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ అంత ముఖ్యమైన కాలేయం (లివర్) 75 శాతం దెబ్బ తిన్నా కేవలం 25 శాతం ఫంక్షనింగ్ తోనే నెట్టుకొచ్చేయడం అంటే అది ఆషామాషీ కాదు. భారతదేశం లోనే గ్రేట్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇలాంటి అరుదైన సమస్యతో ఇప్పటికీ బాధపడుతున్న సంగతి తెలిసింది కొద్ది మందికే. ఆయన కాలేయం మూడొంతులు డ్యామేజ్ అయ్యింది. అయినా ఇప్పటికీ వేకువ ఝామునే నిదుర లేచి ఒక నవయువకుడిలా ఆయన పాటించే క్రమశిక్షణ ఎందరికో స్ఫూర్తి అనే చెప్పాలి. 2000 నుంచి ఇప్పటివరకూ అంటే దాదాపు 20ఏళ్లుగా కాలేయ సమస్యతో అమితాబ్ బాధపడుతూనే ఉన్నారు. అప్పట్లోనే కౌన్ బనేగా కరోర్ పతీ(కేబీసీ) కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన రివీల్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ బి .. టీబీ వంటి సమస్యలతో బిగ్ బి బాధపడుతున్నానని తెలిపారు. కాలేయం సరిగా పని చేయకపోతే చెడు రక్తం శరీరమంతా సర్క్యులేట్ అవుతుంది. అంతేకాదు.. తనకు టీవీ ఉన్నట్టు దాదాపు ఎనిమిదేళ్లు ఆ సమస్యతో బాధపడిన తర్వాతనే తెలిసిందట. అంటే ఎంత అవేర్ నెస్ లేకుండా ఉన్నారో అర్థం చేసుకోవాలి. అయితే రెగ్యులర్ హెల్త్ చెకప్ లు.. ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారానే లైఫ్ ని పొడిగించగలిగారు. ఆరోగ్యకరమైన అలవాట్లు మాత్రమే ఆయన్ని కాపాడాయని చెప్పొచ్చు. తెలియకపోతేనే సమస్య. దానిని తెలుసుకునేందుకు రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని అమితాబ్ చెబుతున్నారు.

వీటన్నిటినీ మించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ (76) ఇప్పటికీ తనకు ఇష్టమైన సినిమాల్లో నటిస్తూ వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వడం లేదు. నిత్య వ్యాపకాల్లో ఉంటూనే రకరకాల సామాజికాంశాలపై జనజాగృతం చేసేందుకు నిరంతరం సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.

ఇక వీటన్నిటినీ మించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల పూజలు పునస్కారాలే ఆయనకు శ్రీరామరక్ష. నిరంతరం అమితాబ్ ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని పూజించే అభిమానులు కోకొల్లలు. తాజాగా ఓ వీరాభిమాని బిగ్ బికి ఇచ్చిన ఓ అరుదైన కానుక ఎంతగానో ఆకర్షిస్తోంది. ఒక టేబుల్ టాప్ లాంతర్ బాల్ తరహాలో కాంతులు విరజిమ్ముతోంది. దానిపై బిగ్ బి ఫ్యామిలీ ఫోటోలు డిస్ ప్లే అవుతున్నాయి. ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉందీ కానుక. అరుదైన గిఫ్ట్ ని అమితాబ్ అందుకున్నారు. అది సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home