మెగాస్టార్ నుండి ఏ క్షణమైన ఆ షాకింగ్ ప్రకటన రావచ్చు

0

బాలీవుడ్ ప్రేక్షకులనే కాకుండా ఇండియన్ సినీ అభిమానులను గత అయిదు దశాబ్దాలుగా ఎంటర్ టైన్ చేస్తున్న మెగాస్టార్ అమితాబచ్చన్ రిటైర్ మెంట్ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన రిటైర్మెంట్ కు సంబంధించిన విషయమై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబచ్చన్ మనసు ఉత్సాహంగా ఉండి కష్టపడాలని.. ఇంకా సినిమాలు చేయాలని భావిస్తున్నా శరీరం మాత్రం సహకరించడం లేదన్నాడు.

నా మైండ్ ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే నా చేతులు మరో విధంగా పని చేస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే నేను రిటైర్ అయ్యే సమయం వచ్చినట్లుగా అనిపిస్తుంది. నా శరీరం సహకరించకున్నా కూడా నేను ఇంట్లో మాత్రం కూర్చోలేక పోతున్నట్లుగా అమితాబ్ తన బ్లాగ్ లో పేర్కొన్నాడు. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న ఈ సమయంలో అమితాబ్ ఏ క్షణంలో అయినా తన రిటైర్ మెంట్ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

అమితాబ్ చాలా కాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఇంకా కొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యారు. ఆ సమయంలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా కూడా ఆయన మాత్రం విశ్రాంతి లేకుండా షూటింగ్స్ లేదా టీవీ షో లు చేస్తూనే ఉన్నారు. వీట్టన్నింటికి బిగ్ బి అతి త్వరలోనే గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అతి త్వరలోనే జరిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
Please Read Disclaimer