వర్మకు మెగాస్టార్ నుంచి మెసేజ్

0

వివాదాల ఆర్జీవీ తెరకెక్కించిన `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ గడపపై వివాదాల్ని పరిష్కరించుకుని ఈ సినిమా రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇక సెన్సార్ అభ్యంతరం వల్ల ఈ సినిమా టైటిల్ ని `అమ్మ రాజ్యంలో..కడప బిడ్డలు` అంటూ టైటిల్ ను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు మెగాస్టార్ నుంచి ఓ మెసేజ్ అందింది. ఇంతకీ ఏమిటా మెసేజ్.. అంటే?

వివాదాల ఆర్జీవీ ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు చేస్తూ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉండగా.. ఈలోగానే వర్మ తదుపరి సినిమాల ప్రమోషన్ ని వేడెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ లో హైదరాబాద్ మాఫియా కథను తెరపైకి తెస్తానని అన్నాడు. పనిలో పనిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలోని చిత్రం `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ గర్ల్ గా పూజ భాలేకర్ నటించారు. ఈ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాల్లో వైరల్ గా దూసుకెళ్లింది. దీనిని చూసిన మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. వర్మపై ప్రశంసలు కురిపించారు. పైగా ఆ లింక్ ని బిగ్ బి తన అభిమానులకు షేర్ చేసారు. “రామ్ గోపాల్ వర్మాస్.. సర్కార్స్ న్యూ ఫిలిం `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` .. ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో తెరకెక్కింది“ అంటూ అమితాబ్ వివరాల్ని వెల్లడించారు. ఆర్జీవీతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనుబంధం గురించి తెలిసిందే. నిశ్శబ్ధ్- సర్కార్ రాజ్- సర్కార్ 3 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కలిసి పని చేశారు. అమితాబ్ ని ఆర్జీవీ ఎంతగా అభిమానిస్తారో ఆర్జీవీని అమితాబ్ అంతకంటే ఎక్కువ గౌరవిస్తారు. అందుకే బాలీవుడ్ లో ఈ టీజర్ ని ప్రమోట్ చేస్తున్నారు.
Please Read Disclaimer