హిజ్రా పాత్రలో బిగ్ బి ఛాలెంజ్

0

లారెన్స్ మాస్టార్ `కాంచన` సిరీస్ బాక్సాఫీస్ ని క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నాలుగు సినిమాలొస్తే మొదటిది హిట్. చివరి మూడూ చక్కని విజయాలు సాధించాయి. కాంచన గంగ (కాంచన2) చిత్రాలు తెలుగులో బంపర్ హిట్లు కొట్టాయి. ఇటీవలే రిలీజైన కాంచన 3 చిత్రం పై విమర్శకులు పెదవి విరిచేసినా బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ హుషారులోనే లారెన్స్ మాస్టార్ హిందీలో `కాంచన` రీమేక్ ని షురూ చేసిన సంగతి తెలిసిందే.

అక్కడ ఈ హారర్ చిత్రంలో కిలాడీ అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కియరా అద్వాణి కథానాయిక. అలాగే అత్య ంత కీలకమైన హిజ్రా పాత్రకు బిగ్ బి అమితాబ్ ని సంప్రదించారని తెలుస్తోంది. మాతృకలో శరత్ కుమార్ పోషించిన ఈ పాత్ర సినిమాకే హైలైట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఆ పాత్రలో బిగ్ బి నటిస్తే సినిమాకి క్రేజు మరింత పెరిగినట్టే. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన బిగ్ బి ఇప్పటివరకూ హిజ్రా పాత్రలో మాత్రం నటించలేదు. అందుకే ఈ రోల్ ని ఆయన ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకునే వీలుంది. అయితే ఈ చిత్రానికి అమితాబ్ సంతకం చేశారా లేదా? అన్నదానిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది. ఇక సౌత్ మీడియాలో దీనిపై ప్రచారం సాగుతున్నా.. బాలీవుడ్ మీడియా మాత్రం స్పందింలేదింకా.

ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూనే.. లారెన్స్ మాస్టార్ ఓ కామియోలో మెరుపులు మెరిపించనున్నారట. మ్యాడీ మాధవన్ – శోభిత ధూళి పాళ ఆసక్తికర పాత్రల్లో నటించనున్నారు. తాజాగా మూవీకి లక్ష్మీ బాంబ్ అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు. 2020లో సినిమాని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇకపోతే కిలాడీ అక్షయ్ కుమార్ కెరీర్ లో వరుసగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో గొప్ప సామాజిక సందేశం ఉన్న కథాంశాల్ని ఎంచుకుని నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇలా ఓ హారర్ జానర్ ని ఎంపిక చేసుకోవడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Please Read Disclaimer