అమ్మ జయలలిత బయోపిక్ హంగామా

0

గత కొంత కాలం గా జయ లలిత బయోపిక్ గురించి ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఒకేసారి ముగ్గురు దర్శకులు ఈ బయోపిక్ ని అత్యంత ప్రతిష్ఠాత్మకం గా సెట్స్ పైకి తీసుకెళ్లేందు కు ప్రయత్నిస్తుండడం తో ఎవరు ఏ కోణం లో అమ్మ కథను చూపించబోతున్నారు? అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే వీటిలో ముందుగా క్వీన్ కంగన టైటిల్ పాత్రలో ఏ.ఎల్.విజయ్- విష్ణు ఇందూరి బృందం సెట్స్ కెళ్లేందుకు ప్రిపరేషన్స్ సాగించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కి తలైవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇంతకుముందు అమెరికా వెళ్లి లుక్ టెస్ట్ లో పాల్గొన్న కంగన .. ఇటీవల గత కొంత కాలంగా హిమచల్ ప్రదేశ్ మనాలి హిల్ స్టేషన్ లోని తన సొంత ఇంట్లో భరత నాట్యం ప్రాక్టీస్ చేసింది.

ఇక అన్ని ప్రిపరేషన్స్ పూర్తయినట్టే. తాజా గా తలైవి రెగ్యులర్ చిత్రీకరణకు కంగన రెడీ అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నై లో మొదలైంది. ఈ సినిమా లో ఇంపార్టెంట్ పాత్రలకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. డ్యాషింగ్ పెర్ఫామర్ అరవింద స్వామిలను ఎంపిక చేసుకున్నారు. స్వామి ఈ చిత్రం లో లెజెండరీ నటుడు.. నాయకుడు ఎం.జి.రామ చంద్రన్(ఎంజీఆర్) పాత్ర లో నటిస్తున్నారు. అమ్మ రైవల్ దివంగత ముఖ్య మంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నారు.

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ బయోపిక్ కి కథను అందించారు. విష్ణు ఇందూరి- శైలేష్ ఆర్.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్- కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జయలలిత గెటప్స్ ని డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే కంగనను రక రకాల గెటప్పుల్లో టెస్టులు పూర్తి చేశారు. ఇక ఇతరత్రా పాత్రలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer