RED భామ.. అచ్చం సమంతకి చెల్లిలా!

0

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఒకేలా ఏడుగురు ఉంటారని అంటారు. ఇది దైవ సృష్టి అన్నది రెగ్యులర్ గా వినే మాట. అప్పుడప్పుడు ఇది నిజమే అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. పోలికల కొందరు అచ్చు గుద్దినట్లే ఉంటారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆర్జీవీ ఎన్టీఆర్ ని పోలిన వాడినే వెతికి తెచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ముంబై దాడుల నేపథ్యంలో సినిమా చేసినప్పుడు కసబ్ అజ్మల్ పాత్ర కోసం అచ్చంగా అదే పోలికలతో ఉన్న ఓ కుర్రాడిని వెతికి పట్టుకున్నాడు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పాత్ర కోసం ఉత్తరాదిన ఓ హోటల్ లో పనిచేసే సర్వర్ ని తీసుకొచ్చారు. ఆ వీడియో.. ఫోటోలు సోషల్ మీడియాలో ఓరేంజ్ లో వైరల్ అయ్యాయి. తాజాగా రెడ్ చిత్ర కథానాయిక అమ్రిత్ అయ్యర్ అక్కినేని కోడలు సమంతను పోలి ఉండడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఆ కళ్లు.. ముక్కు.. కనుబొమలు.. హెయిర్ స్టైల్…పెదాలపై చిరునవ్వు ..ఎక్స్ ప్రెషన్.. ఆ ఫోజ్ చూస్తుంటే సమంతకి చెల్లిలా ఉందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత.. అయ్యర్ ఇద్దరినీ పక్కపక్కనే నిలబెడితే సిస్టర్స్ అని అంగీకరించాల్సిందే.

తాజాగా ఈ ఫోటోని రెడ్ చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియలో జోరుగా వైరల్ అవుతోంది. సమంత కి చెల్లిలా ఉన్నావు! అంటూ నెటిజనులు ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది సమంత బంధువా? అని ఆరా తీస్తున్నారు. సమంత తాలూకానే.. అందుకే ఈ పోలికలు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు బిగ్ బాస్ తెలుగు- సీజన్ 3లోనూ సమంతను పోలిన పార్టిసిపెంట్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది. తాజా చిత్రం రెడ్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.




Please Read Disclaimer