అంత ‘అమృతం’గా ఉండేనా?

0

30 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న ప్రేక్షకులు చాలా మంది బుల్లి తెరపై అమృతం సీరియల్ చూసే ఉంటారు. అప్పట్లో అమృతం ఒక సంచలనం. కామెడీ సీరియల్ గా ప్రారంభం అయిన అమృతం ఏ స్థాయిలో దూసుకు పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్ వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఎదురు చూసేవారు. ఏ ఎపిసోడ్ కు ఆ ఎపిసోడ్ విభిన్నమైన కథలతో కాన్సెప్ట్ లతో అప్పట్లో అమృతంను తెరకెక్కించిన విషయం తెల్సిందే.

గుణ్ణం గంగరాజు మెదడు నుండి వచ్చిన అమృతం ఇప్పటికి కూడా ఏదో ఒక ప్లాట్ ఫార్మ్ ద్వారా ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అప్పట్లో వచ్చిన అమృతంను ఆ మద్య ఈటీవీ ప్లస్ లో ప్రసారం చేశారు. ఆ తర్వాత యూట్యూబ్ లో ఉంచారు. ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై ఉంచారు. అమృతంకు వస్తున్న ఆధరణ చూసి జీ తెలుగు వారు అమృతం వెబ్ సిరీస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సక్సెస్ అయితే దాన్నే ఛానెల్ లో కూడా ప్రసారం చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

అమృతం క్రియేటర్ అయిన గుణ్ణం గంగరాజును ఈ వెబ్ సిరీస్ కోసం రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగానే అమృతం… ఆంజనేయులు.. అప్పాజీ.. సర్వం ఈ నాలుగు పాత్రలను బేస్ చేసుకుని విభిన్నమైన కాన్సెప్ట్ లతో అమృతంను కొనసాగించాలని భావిస్తున్నారు. కాని అప్పట్లో ఈ నాలుగు పాత్రలకు మంచి నటీనటులు దొరికారు.

అప్పటి కామెడీని ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాని ఇప్పుడు ప్రత్యేకంగా మళ్లీ వెబ్ సిరీస్ అంటూ తీస్తే ఆధరిస్తారా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే ఎంత సేమ్ టీం అయినా అమృతంను గతంలో చేసిన విధంగా ఆ ఫీల్ తో చేయడం అంటే ఎవరికైనా అసాధ్యం.

ఇప్పుడు వచ్చిన ప్రేక్షకుల అభిరుచి అనే ఉద్దేశ్యంతో ఏదో ఒక మార్పు చేయాల్సి ఉంటుది. దాంతో మొత్తం కాన్సెప్ట్ దెబ్బ తిని ఎపిసోడ్ చెడిపోయే అవకాశం ఉంది. అందుకే మళ్లీ అమృతం తీస్తే గతంలో మాదిరిగా అంత అమృతంగా ఉండక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer