ఆరు గంటలకే నిద్ర లేపేస్తున్న కన్నయ్య

0

లేడీ రోబో ఎమీజాక్సన్ ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చిట్టి కన్నయ్య 2.0 అంటూ అభిమానులు ముద్దుగా పిలిచేసుకున్నారు. చిట్టికన్నయ్యలో అన్నీ అమ్మ పోలికలేనని ఇదిగో ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. లండన్ బిలియనీర్ జార్జి పనాయటౌతో ప్రేమకు కానుక ఇది.

ప్రస్తుతం చిన్నారి కన్నయ్య ఏం చేస్తున్నాడు? అంటే.. ఎమీజాక్సన్ వారసుడు చాలా వేగంగానే ఎదిగేస్తున్నాడు. ఇక మీదట నట్టింట బుడిబుడి నడకలతో మామ్ డాడ్ లను ఆడుకునేందుకు రెడీ అయిపోతున్నాడని తాజాగా రివీల్ చేసిన ఫోటో చెబుతోంది.

అసలు చిట్టి కన్నయ్య నిద్ర పోతున్నాడో లేదో కానీ తెల్లారి ఆరు అవ్వకముందే తనని మాత్రం నిద్ర లేపేస్తున్నాడట. ఆ సమయంలో అతడు నిద్ర లేపేస్తుండడంతో వెంటనే పార్క్ కి మోర్నింగ్ వాక్ కి వెళ్లిపోతోందట. వారసుడి చిట్టి వేషాలకు ఎంతో ఉబ్బిపోతోంది మామ్ ఎమీ. తనకు ఐ లవ్ యు కూడా చెప్పింది. అన్నట్టు.. ఇంకో ఏడాది వరకూ ఎమీజాక్సన్ తిరిగి ముఖానికి రంగేసుకుని నటించేందుకు స్కోప్ కనిపించడం లేదు ఈ వాలకం చూస్తుంటే..
Please Read Disclaimer