బీచ్ లో చిట్టికన్నయ్య 2.0 జోజో

0

రోబో గాళ్ ఎమీజాక్సన్ గత కొంతకాలంగా స్థబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ బిజినెస్ టైకూన్ జార్జి పనాయటౌతో సహజీవనం అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అటుపై జార్జితో నిశ్చితార్థం పూర్తయింది. 2020 ఆరంభంలోనే ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారమైంది. ఆ సంగతి అటుంచితే ప్రస్తుతం ఎమీజాక్సన్ పుత్రరత్నం చిట్టి కన్నయ్య 2.0 ఏం చేస్తున్నాడు? అంటే.. అప్పుడే బుడి బుడి అడుగులు వేసేంత పెద్ద వాడైపోతున్నాడనే ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.

ఇదిగో ఎమీజాక్సన్ మరోసారి చిట్టి కన్నయ్యను అభిమానులకు ఇలా పరిచయం చేసింది. రెడ్ హాట్ బికినీలో బీచ్ పరిసరాల్లో తనయుడితో మురిపెం ఇలా ప్రదర్శించింది. రెడ్ నిక్కరులో జూనియర్ జార్జి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి వారసుడిగా అతడి భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. ఎండ కన్నెరగని రాకుమారుడిలా సకల సౌకర్యాలు.. భోగాలు అనుభవించే అరుదైన ఛాన్స్ ఎమీ వారసుడికి ఉంది.

ఇక ఎమీజాక్సన్ ఇంకా ఎన్నాళ్లు ఇలా? ఇంకా కాపురంలో మురిపెం తీరలేదా? తిరిగి నటనలోకి వచ్చేది ఎప్పటికి? ఇలా సంసార సాగరంలోనే కాలం గడిపేస్తుందా? ఇలా ఎన్నో రకాల సందేహాలు అభిమానులకు ఉన్నాయి. మరోవైపు హాలీవుడ్ లో సూపర్ ఉమెన్ తరహా సిరీస్ లో నటిస్తుందని 2019లో ప్రచారమైంది. కానీ ఇప్పటివరకూ దానికి సంబంధించిన మరో అప్ డేట్ అయితే రాలేదు. అలాగే ఇటు హిందీ సహా సౌత్ సినిమాల్లో తిరిగి నటించేది ఎప్పుడు? అన్నదానికి సరైన క్లారిటీ రాలేదు. మరి దీనిపై ఎమీజాక్సన్ స్పందిస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer