గర్భిణులకు రోబో 2.0 గాళ్ టిప్స్

0

నెలలు నిండిన గర్భిణిగా ఉన్నప్పుడు వాకింగ్ లు జాగింగ్ లు జిమ్మింగ్ లు అంటూ శ్రమించేవాళ్లు తక్కువ మందే ఉంటారు. ఆ అరుదైన మూవ్ మెంట్ లో ఇలాంటి సాహసాలు చేయకూడదని వారించే పెద్దాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అయితే మారిన కాలంలో గర్భిణి చేయాల్సిన ఎక్సర్ సైజుల గురించి డాక్టర్లు ప్రాక్టికల్ గా చెబుతున్నారు. ఇలాంటి వాటిపై సెలబ్రిటీలు చేసే ప్రచారం కొంతవరకూ ఎంకరేజ్ మెంట్ అనే చెప్పాలి. ఇందులో ఈ బ్రిటీష్ బ్యూటీ నిష్ణాతురాలనే చెప్పాలి.

ఎమీ జాక్సన్ ప్రస్తుతం నెలలు నిండిన గర్భిణి అన్న సంగతి తెలిసిందే. తొలి సంతానం ఆరోగ్యం కోసం ఈ బ్రిటీష్ బ్యూటీ ముందస్తు ఆలోచన- శ్రమ చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నిటినీ తీసుకుంటోంది. ప్రతిసారీ ఫ్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్న ఎమీజాక్సన్ రెగ్యులర్ గా తన వర్కవుట్ల ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇలాంటప్పుడు అంత సాహసమా? అని చూసేవాళ్లు షాక్ కి గురవుతున్నారు. సేమ్ టైమ్ తన కమిట్ మెంట్ కి ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా ఎమీజాక్సన్ మరో ఫోటోని షేర్ చేసి ఆసక్తికర సంగతిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫ్రెగ్నెన్సీకి ముందే నా జీవన విధానాన్ని ఫిట్ గా మార్చుకున్నానని ఎమీజాక్సన్ చెప్పింది. ఆ అలవాటే ఇప్పుడు తనకు కలిసొచ్చిందట. రెగ్యులర్ గా 20 నిమిషాల వాకింగ్ కూడా మంచిదేనని ప్రూవైంది. ఫ్రెగ్నెన్సీ సంక్లిష్ఠతల నుంచి బయటపడేందుకు ఇవన్నీ చేయాలి! మీరు కూడా మీ డాక్టర్ ని కలిసి సలహా తీసుకోండి. నేను ప్రతిరోజూ యాక్టివ్ గా ఉంటున్నా. యోగా చేస్తున్నా.. అని తెలిపారు. వివాహానికి ముందే ఫ్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. ఆ తర్వాతనే ఎమీజాక్సన్ నిశ్చితార్థమైంది. త్వరలోనే తన బోయ్ ఫ్రెండ్ కం ప్లేబోయ్ జార్జి పనాయటౌ ని పెళ్లాడేందుకు ఎమీ రెడీ అవుతోందట.
Please Read Disclaimer