బ్యూటిఫుల్ కపుల్.. రొమాంటిక్ కిస్

0

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ చేసింది తక్కువ సినిమాలే కానీ పాపులారిటీ మాత్రం ఎక్కువే వచ్చింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ’.. ‘2.0’ చిత్రాల్లో నటించడంతో ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అమీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. గర్భవతి అనే సంగతి తెలిసిన తర్వాతే ప్రియుడు జార్జ్ పనయిటుతో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇంకా ఈ ప్రేమికుల వివాహం జరగాల్సి ఉంది.

అయితే అంతలోపు అమీ తన ప్రెగ్నెన్సీ టైమ్ ను సెలెబ్రేట్ చేసుకుంటోంది. ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లు.. వెకేషన్స్ తో ఫుల్ గా చిల్ అవుట్ అవుతోంది. అమీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా మరోసారి అలానే ఫోటోలను పోస్ట్ చేసింది. కాబోయే భర్తకు ఘాటు ముద్ధిస్తూ ఫోటోకు పోజిచ్చింది. ఈ ఫోటోకు “ఈ జీవితంలో ఎక్కువగా నమ్మకం ఉన్న విషయం ఏంటంటే.. నువ్వు అద్భుతమైన నాన్నవి అవుతావని. ఫ్యూచర్ లో రాబోయే ఫాదర్స్ డే లకు ఇదే ప్రారంభం. హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే. మేము నిన్ను ప్రేమిస్తున్నాం” అంటూ ఒక మంచి ఫీల్ ఉండే క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటో నిజంగానే రొమాంటిక్ గా ఉంది. నేవీ బ్లూ కలర్ బ్లేజర్ లో జార్జ్ ఎంతో స్టైల్ గా కనిపిస్తుంటే.. అమీ మా-త్రం బ్లాక్ కలర్ పై ప్రింటెడ్ కలర్స్ ఉండే వెల్వెట్ గౌన్ లో అందాల భామలాగా కనిపిస్తోంది. ఇక జార్జ్ – అమీ ల మధ్య ఉండే కెమిస్ట్రీ సాధారణమైంది కాదు. అది ప్రేమ గురించి తెలిసిన వారికే అర్థం అవుతుంది. ఈ ఫోటోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. “స్మార్ట్ హస్బెండ్.. స్మార్ట్ వైఫ్”.. “బ్యూటిఫుల్ కపుల్.. రొమాంటిక్ కిస్”.. “రోబో బ్యూటీ.. హ్యూమన్ కిస్” అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer