తెలుగులో ఓ అవకాశం ఇస్తే.. ప్రూవ్ చేసుకుంటా

0

సినీ ఇండస్ట్రీకి గత కొంతకాలంగా దూరంగా ఉంటుంది బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్. బ్రిటిష్ లోనే పుట్టి పెరిగిన ఈ భామ ఎక్కువగా ఇండియన్ లాంగ్వేజ్ సినిమాలలో నటించింది. ఈ భామ టీనేజ్ లో ఉండగానే మోడలింగ్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. అప్పటి నుండి అమ్మడికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అమీ జాక్సన్ 2010లో విడుదలైన తమిళ సినిమా ‘మదరాసపట్టణం’తో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక అప్పటి నుండి ఇండియాలోనే బిజీ మోడల్ గా మారిపోయింది. ఎన్నో బ్యూటీ యాడ్స్ లో నటించింది అమీ. ఇక తెలుగులో ‘ఏ మాయచేసావే’ సినిమా హిందీ రీమేక్ ‘ఏక్ దీవానా థా’తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఎందుకో మోడల్ గా బిజీ ఉన్నంతగా సినిమాల పరంగా బిజీ కాలేకపోయింది అమీ.

అందం ఉంది అవకాశాలు లేవు. ఇక 2014లో ఎవడు సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమాలో కేవలం ఓ పాటకే పరిమితం అయింది అమ్మడు. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక 2015లో డైరెక్టర్ శంకర్ రూపొందించిన మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ ‘ఐ’లో మెరిసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందటంతో అమీ ఆశలన్నీ వృధా అయిపోయాయి. ఎందుకంటే శంకర్ సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. కెరీర్ ని మలుపు తిప్పుతుందేమో అనుకుంది.. అందాల ఆరబోతకు కూడా ఎక్కడా రాజి పడలేదు. అమ్మడిని చూసి ఇండియన్స్ అంతా ముగ్ధులయ్యారు. కానీ ఆ సినిమా ఓటమి అమీకి అవకాశాలు ఆపేసింది. తర్వాత మళ్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘రోబో2.0’ సినిమా చేసినా పెద్దగా తేడా ఏమి అనిపించలేదు.

ఇక ఏం చేయాలో తెలియక తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనయిటోతో సహజీవనం చేసి గతేడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్ళై పిల్లలు పుట్టినా మాములుగా ఇండియన్ సినిమాలు చేసిన హీరోయిన్లు గ్లామర్ షో గాని సినిమాలు కానీ చేయడం ఆపరు. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ ఇంకా కొడుకుతో కలిసి ఉంటున్న అమీ.. త్వరలోనే మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతుందట. తమిళ హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అమీ.. ఇక పై తెలుగులో చేయాలనీ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎప్పటి నుండో తెలుగులో చేయాలనీ అనుకుందట కానీ అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడైనా మంచి అవకాశం వస్తే తనని తను ప్రూవ్ చేసుకుంటా అంటుంది. లాక్ డౌన్ పూర్తయ్యేలోగా ఏ ఒక్క హీరో అయినా అవకాశం ఇవ్వకపోతాడా అని ఎదురు చూస్తుంది. చూడాలి మరి ఏదైనా తెలుగు సినిమాలో మెరుస్తుందేమో..!
Please Read Disclaimer