డెలివరీలోపే వివాహం.. పెళ్ళి పనుల్లో అమీ!

0

బ్రిటిష్ భామ అమీ జాక్సన్ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రెగ్నెంట్ ఫోటో షూట్లు చేయడమే కాకుండా రెగ్యులర్ గా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉండడంతో అందరికీ ఈ విషయం తెలుసు. ప్రస్తుతం అమీకి ఏడో నెల. త్వరలో తన ప్రియుడు జార్జ్ పనయిటును వివాహం చేసుకునేందుకు డిసైడ్ అయిందట.

బిజినెస్ మ్యాన్ అయిన జార్జ్ తో అమీ చాలాకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. అయితే ఇద్దరూ గట్టిగా డేటింగ్ చేయడంతో పెళ్ళికి ముందే అమీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెన్సి విషయాన్ని అభిమానులతో పంచుకున్న కొంతకాలానికి ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. గ్రాండ్ గా జరిగిన ఆ ఎంగేజ్ మెంట్ కు కుటుంబ సభ్యులతో పాటుగా ఫ్రెండ్స్.. సన్నిహితులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే అమీ త్వరలో జార్జ్ ను వివాహం చేసుకుంటున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుతం అమీ-జార్జ్ జంట ఇటలీలో వెనిస్ నగరంలో ఉన్నారట. పెళ్ళికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయట.

ఈ లెక్కన మరో నెల లోపే అమీ జాక్సన్ కాస్తా అమీ పనయిటుగా మారిపోతుంది. ఇండియాలలో జనాలకు ‘పెళ్ళికి ముందు ప్రెగ్నెన్సీ’.. ‘డెలివరీకి ముందు పెళ్ళి’ అనే కాన్సెప్ట్ లు కొత్తగా అనిపిస్తాయేమో కానీ అమీ జాక్సన్ బ్రిటీష్ భామ కదా. జార్జ్ కూడా అక్కడి వ్యక్తే.. సో తప్పేమీ లేదు.. మీరు మరీ పక్కింటి పాపాయక్కలా నొసలు చిట్లించి పాతకాలం సామెతలు వేయాల్సిన పని లేదు. త్వరలో పెళ్ళి వార్తలు కూడా వస్తాయి. చక్కగా చదువుకోండి!
Please Read Disclaimer