అమెరికాలో అమీ ఏం సంపాదిస్తోందో..

0టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్.. తనకు రోల్ నచ్చాలే కానీ ఎలాంటి సంశయాలు లేకుండా ఏ సినిమా అయినా ఏ భాష అయినా చేసేసేందుకు సిద్ధంగా ఉండే బ్యూటీ అమీ జాక్సన్. బేసిక్ గా ఈ బ్యూటీది లండన్ అయినా.. ఇండియాలో తెగ రెచ్చిపోతుడం ఈమె స్టైల్.

బికినీ వేయడం గొప్ప కాదు.. అది ధరిస్తే దానికే అందం వచ్చేంతటి పర్ఫెక్ట్ బికినీ నాకు ఉంది గర్వంగా చెప్పుకోగల సత్తా ఉన్న అమీ జాక్సన్.. ఆన్ స్క్రీన్ పై కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మెరిసిపోతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఈ లండన్ భామ క్యాలిఫోర్నియాలో చక్కర్లు కొట్టేస్తోంది. అక్కడి నుంచి బోలెడన్ని ఫోటోలను కూడా షేర్ చేసేస్తోంది. వీటిలో అందాలు పంచడంతో పాటు.. అల్ట్రామోడర్న్ స్టైలింగ్ ను కూడా చూపించేస్తోంది అమీ. ఇంతకీ అసలు అమీ ఇన్ని రోజులు ఆ కంట్రీలో ఏం చేస్తోందా అంటే.. వరుసగా షూటింగులలో తెగ భాగం అయిపోతోంది.

ఓ గార్మెంట్స్ కంపెనీ తో పాటు.. ఓ క్యాసినో యాప్ నకు కూడా ప్రచారం చేసేందుకు అంగీకరించిన అమీ జాక్సన్.. వాటికి సంబంధించిన ఫోటో షూట్స్.. షూటింగ్ లలో భాగం అవుతోంది. వాటిలో ఎలాగూ అందాలు పంచాలి.. పైగా ఇవి ప్రచారం కోసం చేస్తున్నవే. అందుకే పనిలో పనిగా వాటి అఫీషియల్ లాంఛింగ్స్ కంటే ముందే తనే ట్విట్టర్ లో తన అందాలతో కలిపి ప్రదర్శించేసి.. అభిమానులను ఆకట్టుకుంటోంది అమీ.