చిట్టి కన్నయ్య 2.0 ఎంత బుద్ధిమంతుడో

0

చిట్టి కన్నయ్య 2.0 అరైవ్ అయ్యి అప్పుడే కొన్ని నెలలు అయిపోతోంది. గర్భధారణ మొదలు బిడ్డ జన్మించే ముందు ప్రసవానికి సంబంధించిన ప్రతి ఎమోషన్ ని ఎమీజాక్సన్ అభిమానుల కోసం షేర్ చేసిన సంగతి తెలిసిందే. వారసుడి రంగ ప్రవేశం ఈ అమ్మడిలో బోలెడంత ఆనందం నింపింది. బ్రిటీష్ బిజినెస్ టైకూన్ జార్జి పనాయటౌ-ఎమీజాక్సన్ ఆనందానికి అవధుల్లేవ్. తమ బిడ్డకు ఆండ్రియాస్ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఈ జంటకు ఇదివరకూ నిశ్చితార్థం అయ్యింది. 2020లో పెళ్లికి రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. అయితే పెళ్లికి ముందే మమ్మీ డాడీగా లైఫ్ ని సెలబ్రేట్ చేస్తున్నారు.

ఇంతకీ చిట్టి కన్నయ్య 2.0 అలియాస్ ఆండ్రియాస్ ఏం చేస్తున్నాడు? అంటే.. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇంతకుముందు ఎమీజాక్సన్ తన వారసుడి తొలి ఫోటోషూట్ ని అభిమానులకు షేర్ చేసింది. అతడి లైఫ్ లో ప్రతి ముఖ్యమైన విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు వెల్లడిస్తూనే ఉంది.

తాజాగా ఆండ్రియాస్ అమ్మ ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోని షేర్ చేసింది. అల్ట్రా మోడ్రన్ మమ్మీ ఎమీజాక్సన్ ఒక సూపర్ గాళ్ రేంజులో రెడీ అయ్యి ఇలా ఆండ్రియాస్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఆండ్రియాస్ మమ్మీ గుండెలపై ఒదిగిపోయి ఎంతో బుద్ధిగా నిదురిస్తున్నాడు. చిట్టి కన్నయ్య 2.0 ఎంత బుద్ధిమంతుడో అన్నట్టుగా ఉందీ ఫోజు!! అన్నట్టు ఎమీజాక్సన్ తిరిగి సినిమాల్లో రీజాయిన్ అయ్యేదెపుడు? ఫ్యాన్స్ కి ఏమని చెబుతుందోనని వెయిటింగ్!
Please Read Disclaimer