‘ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేస్కుంటా’ అంటున్న అమీ జాక్సన్!!

0

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది బ్రిటిష్ భామ అమీ జాక్సన్. అక్కడే పుట్టి పెరిగిన ఈ భామ చేసింది మాత్రం ఇండియన్ సినిమాలే. అయితే టీనేజిలో ఉండగానే మోడలింగ్ ప్రారంభించి.. 2009లో మిస్ టీన్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఇక అమీ జాక్సన్ 2010లో విడుదలైన తమిళ సినిమా ‘మదరాసపట్టణం’తో సినీ ఇండస్ట్రీలోకి హీరోయినుగా అడుగుపెట్టింది. అప్పటి నుండి ఇండియాలోనే బిజీ మోడల్ గా మారిపోయింది. ఎన్నో బ్యూటీ యాడ్లలో కూడా నటించింది అమీ. ‘ఏక్ దీవానా థా’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఎందుకో మోడల్ గా బిజీ ఉన్నంతగా సినిమాల పరంగా బిజీ కాలేకపోయింది.

అమీ దగ్గర అందం ఉంది కానీ అవకాశాలు లేవు. 2014లో ఎవడు సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమాలో కేవలం ఓ పాటకే పరిమితం అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక 2015లో డైరెక్టర్ శంకర్ రూపొందించిన మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్ ‘ఐ’లో మెరిసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందటంతో అమీ ఆశలన్నీ వృధా అయిపోయాయి. ఎందుకంటే శంకర్ సినిమా అంటే ఏ హీరోయిన్ కెరీర్ మలుపు తిప్పుతుందేమో అనుకుంది కానీ లాభం లేదు. ఏమైనా అందాల ఆరబోతకు మాత్రం వెనకాడట్లేదు. తర్వాత మళ్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘రోబో2.0’ సినిమా చేసినా పెద్దగా తేడా ఏమి అనిపించలేదు.

ఇక లాభం లేదని తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనయిటోతో సహజీవనం చేసి గతేడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్ళై పిల్లలు పుట్టినా మాములుగా ఇండియన్ సినిమాలు చేసిన హీరోయిన్లు గ్లామర్ షో గాని సినిమాలు కానీ చేయడం ఆపరు. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ ఇంకా కొడుకుతో కలిసి ఉంటున్న అమీ.. బికినీతో రెచ్చిపోతుంది. త్వరలోనే మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధం అవుతుందట. తమిళ హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అమీ.. ఇక పై తెలుగులో చేయాలనీ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎప్పటినుండో అనుకుంటుందట కానీ అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడైనా మంచి అవకాశం వస్తే తనని తను ప్రూవ్ చేసుకుంటా అంటుంది. చూడాలి మరి తెలుగుతెరపై మెరుస్తుందేమో..!