ఫోటోషూట్లు ఫుల్లు అవకాశాలు నిల్లు!

0

బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ పేరు తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది వినే ఉంటారు. రాజ్ తరుణ్ ‘రాజుగాడు’.. సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ లో హీరోయిన్ గా నటించింది. ఈ తెలుగు సినిమాలే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. ఈతరం బ్యూటీల స్టైల్ లోనే సోషల్ మీడియాను వేడినూనెలో మిర్చి బజ్జిని వేయించినట్టు వేయిస్తుంది. నెటిజన్ల నెటిజన్ల మనసులు అలానే దోరగా వేపుడుగా మారతాయి.

రీసెంట్ గా మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతూ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “అంతు చిక్కని.. ఆకర్షణీయమైన.. సాధారణమైన అవగాహనకు అందని” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. అమైరా తన గురించి కొంచెం తాత్వికంగా సాధారణ ప్రజల భావాలకు అందని భావం ఏదో వ్యక్తపరిచినట్టుగా ఉంది. అయినా ఫోటో ముఖ్యంకానీ క్యాప్షన్ కాదు. ఫోటోలో గ్రీన్ కలర్ టాప్ పోల్కా డాట్స్ తరహాలో కనిపించే డిజైన్ తో ఒక వైట్ స్కర్ట్ ధరించి ఒక సెన్సువల్ పోజిచ్చింది. మ్యాచింగ్ షూ ధరించింది. బొత్తాలు అసలు లేకుండా ఒకే ముడివేసి ఆ ముడి చివరను ఒక తాడులా వేలాడదీయడంతో అందులో కళాత్మకత ఉట్టిపడుతోంది. ఈ స్థాయిలో ఫోటోషూట్ చేస్తే హాట్ నెస్ లేకపోతే ఎలా అందుకే కాస్త ఘాటుగా అందాలను కూడా వడ్డించింది.

ఇలాంటి ఫోటోలు ఫాలోయర్లకు నచ్చుతాయి. ఈ ఫోటో కూడా నచ్చింది. అందుకే మంచి కామెంట్లు పెట్టారు. “ఆసమ్ మేడమ్”.. “స్టన్నింగ్ డ్రెస్” అంటూ కామెంట్లు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ అమైరా ఇలాంటి ఫోటోషూట్లు రెగ్యులర్ గా చేస్తూనే ఉంది కానీ టాలీవుడ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు.
Please Read Disclaimer