అమైరా టెంప్టింగ్ థై షో..!

0

అమైరా దస్తూర్.. పరిచయం అవసరం లేదు. అందానికి అందం ప్రతిభ ఉన్న ముంబై బ్యూటీ ఎందుకనో ఆశించిన రేంజుకు ఎదగలేకపోయింది. టాలీవుడ్ తెరపై ఇలా కనిపించి అలా మాయమైంది. నటించిన తొలి సినిమాతోనే కుర్రకారులో అమైరా లుక్ అలా గుర్తుండిపోయినా తిరిగి మరో అవకాశం అందుకోలేకపోయింది.

మంజుల దర్శకత్వం వహించిన `మనసుకు నచ్చింది` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ చిత్రంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించాడు. తొలి ప్రయత్నం పక్కింటమ్మాయి తరహా పాత్రలో నటించడం అమైరాకు మైనస్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ వదిలి ఇరుగు పొరుగు భాషల్లో ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడా అంతంత మాత్రమే.

ఇటీవల ఇతర నాయికల్లానే సోషల్ మీడియాల్లో అమైరా లేటెస్ట్ ఫోటోషూట్లతో వేడెక్కిస్తోంది. ఈ భామ తాజా ఫోటో వైరల్ గా మారింది. థైషోస్ తో ఊరించేలా అందాలతో కుర్రకారు హార్ట్ ని టచ్ చేసింది. మిల్కీ అందాలపై ఎల్లో ఫ్రాకు నిగనిగలు హీట్ పెంచేస్తున్నాయ్. కనీసం అమైరా ప్రయత్నం చూసైనా మన నిర్మాతలు పిలిచి అవకాశాలిస్తారేమో చూడాలి. తమిళంలో ఊడి ఊడి ఉఝికానుమ్.. కాదలై తేడి అనే చిత్రాల్లో నటిస్తోంది. పిల్ ఫర్ సింగ్ అనే రీమేక్ చిత్రంలోనూ నటించేందుకు సంతకం చేసింది.