జోహార్ గారి పార్టీలో రానా కూడా గెస్ట్!

0

టాలీవుడ్ లో చాలామంది హీరోలే ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేవారు మాత్రం తక్కువ. కానీ రానా దగ్గుబాటి మాత్రం అలా కాదు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో రానా ఒకరు. ఇలా ప్యాన్ ఇండియా రికగ్నిషన్ అనగానే అందరూ ‘బాహుబలి’ తో వచ్చిన గుర్తింపు అనుకుంటారు కానీ నిజానికి ‘బాహుబలి’ కంటే ముందే రానా బాలీవుడ్ సినిమాల్లో.. తమిళ చిత్రాల్లో నటించి అంతటా గుర్తింపు సాధించాడు. అయితే ‘బాహుబలి’ ఆ గుర్తింపును నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.

రానా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి.. మాటకారి కావడంతో అన్ని ఇండస్ట్రీలలోనూ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకు బాలీవుడ్ ఎక్సెప్షన్ ఏమీ కాదు. అసలు ‘బాహుబలి’ ని కరణ్ జోహార్ టేకప్ చేసే ముందు ఆయనతో చర్చలు జరిపిన వారిలో రానా ఒకరని టాక్. రానాకు కరణ్ జోహార్ తో పర్సనల్ ఫ్రెండ్ షిప్ ఉంది. అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతోంది. అందుకే రీసెంట్ గా కరణ్ తన నివాసంలో సన్నిహిత మిత్రులకు ఒక పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీలో పాల్గొనేందుకు రానాకు కూడా ఆహ్వానం వచ్చింది. దీంతో ముంబై వెళ్లి ఆ పార్టీ లో రానా పాల్గొన్నాడట. ఈ పార్టీలో బాలీవుడ్ లోని యంగ్ బ్యాచ్ అంతా హాజరయిందని సమాచారం.

సోనాక్షి సిన్హా.. అనన్య పాండే.. ఇషాన్ ఖట్టర్.. తారా సుతారియా తదితరులు ఆ పార్టీలో ఉన్నారట. మరి రానా అదిపనిగా ముంబైకి వెళ్ళిమరీ పార్టీకి హాజరయ్యాడంటే.. జస్ట్ క్యాజువల్ పార్టీ అయి ఉండకపోవచ్చని.. కరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులలో ఒకదానిలో రానాను నటింపజేసేందుకు చర్చ జరిగి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయినా రానా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కదా.. అంత టైం ఎక్కడుందబ్బా?