అతగాడిది లిప్ లాక్ లేని లవ్ స్టోరీ!

0

మామూలే. అందులోకి యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండలాంటి హీరో ఇంట్లో నుంచి మరో నటుడు వస్తున్నాడంటే అంచనాలు ఎక్కువే. ఇలాంటివేళ అన్న ఇమేజ్ కు తగ్గట్లే అంతో ఇంతో తమ్ముడు కూడా ఆ తరహా ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ.. అందుకు భిన్నం తన తీరు అన్న విషయాన్ని చెప్పేశారు ‘రౌడీ’ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.

కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న దొరసాని చిత్రంలో ఆనంద్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న వైనం తెలిసిందే. అన్న హీరో కావటంతో తమ్ముడికి అవకాశాలు వచ్చాయన్న మాట నిజమే అయినా.. ఆనంద్ కు ఎలాంటి యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అమెరికాకు వెళ్లక ముందు థియేటర్ ఆర్టిస్ట్ గా చేశాడు. నటనలో అనుభవం ఉంది కానీ కెమేరా ముందు మాత్రం లేదని చెప్పాలి.

తన తొలి సినిమా దొరసానికి సంబంధించి ఆనంద్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా అన్నంతనే అన్న లవ్ స్టోరీస్ లో మాదిరి యాంగర్.. లిప్ లాకులు తమ దొరసాని మూవీలో ఉండవని క్లియర్ కట్ గా చెప్పేశాడు. తన సినిమాలో అలాంటివేమీ ఉండవని తేల్చేశాడు.

1980లో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని.. రాజు.. దొరసాని మధ్య జరిగిన ప్రేమకథని చెప్పాడు. తమ కథలోని స్వచ్ఛత.. నిజాయితీ ఈ లవ్ స్టోరీని ముందుకు నడిపిస్తాయన్నారు. ఈ మూవీలో షూటింగ్ మొత్తం రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేసినట్లు చెప్పారు. లవ్ స్టోరీ.. అందునా ఇప్పటికాలంలో కాసింత యాంగర్.. మరికాస్త లిప్ లాక్ లాంటి హాట్ డోసులేమీ లేకుండా అంటే ఈ జెనరేషన్ కు ఎక్కుతుందంటారా?
Please Read Disclaimer