దేవరకొండ షాకింగ్ రీమేక్

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ఆనంద్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తన రెండవ సినిమాను చేస్తున్న ఆనంద్ మూడవ సినిమా చర్చలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా తన మూడవ సినిమాను 90 లలో వచ్చిన ‘తాళి’ కి రీమేక్ గా చేయబోతున్నాడట.

దాదాపు రెండు పుష్కరాల క్రితం ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన తాళి సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆ సినిమాను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఒక దర్శకుడు ఆనంద్ దేవరకొండను ఒప్పించినట్లుగా సమాచారం అందుతోంది. ఆనంద్ దేవరకొండ కూడా ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ సినిమాలకు ఎప్పటికి కూడా మంచి ఆధరణ ఉంటూనే ఉంటుంది. అందుకే ఆనంద్ దేవరకొండ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ను ఈమద్య యంగ్ హీరోలు ఎక్కువగా తీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆనంద్ దేవరకొండ ఫ్యామిలీ సినిమాపై పడ్డాడు. కొత్తగా ట్రై చేయబోతున్న ఆనంద్ దేవరకొండ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తాడా చూడాలి. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేయడం వల్లే తన అన్న విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. అందుకే ఆనంద్ దేవరకొండ కూడా రొటీన్ కు విభిన్నంగా ఉండాలని ఫ్యామిలీ సినిమా పై పడ్డట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer