బంగారు తీగ బ్రాండెడ్ చేపలా

0

బాలీవుడ్ లో నవతరం నాయికల స్పీడ్ ముందు ఏదీ నిలబడేట్టు లేదు. జాన్వీ – సారా అలీఖాన్- అనన్య పాండే- తారా సుతారియా లాంటి భామలు జెట్ స్పీడ్ తో దూసుకొచ్చారు. వయా సోషల్ మీడియా ఊపిరి సలపనివ్వని ట్రీటిస్తున్నారు. అనునిత్యం ఈ అందాల భామలు ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలు- వీడియోలను అభిమానులు తరచి తరచి చూస్తున్నారు. వాటిని అంతర్జాలంలో జోరుగా వైరల్ చేస్తున్నారు.

ఇక ఆ నలుగురు భామల్లో యంగ్ బ్యూటీ అనన్య పాండే అందచందాల గురించి చెప్పాల్సిన పనేలేదు. సముద్రం మీద కారు మబ్బుల నడుమ ఉరుములోంచి పుట్టుకొచ్చిన మెరుపు తీగలా తళుక్కుమనడంలో ఈ అమ్మడి తర్వాతనే. ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్ని పసిగట్టి ఎప్పటికప్పుడు ఎవ్వర్ లేటెస్ట్ స్టైల్స్ తో చితక్కొడుతోంది. జాన్వీ- సారాలకు ధీటుగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో స్పీడ్ చూపిస్తోంది.

తాజాగా రివీల్ చేసిన ఈ కొత్త ఫోటో చూస్తే ఆ మాట మీరే చెబుతారు. టాప్ టు బాటమ్ ఈ స్పెషల్ గోల్డ్ డిజైనర్ వేర్ తనకోసమే పుట్టుకొచ్చిందా? అన్నంత తీరుగ్గా కుదిరింది. గోల్డ్ మెటాలిక్ ఛమ్కీల డ్రెస్ లో బంగారు తీగ బ్రాండెడ్ చేపలా తళతళా మెరుస్తోంది. అందునా ఈ గోల్డ్ షిమ్మరీ డ్రెస్ లో థై సొగసుల్ని ఎలివేట్ చేసిన తీరు కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటో యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. లేటెస్టుగా సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లో బర్త్ డే వేడుక జరుపుకున్న అనన్య ఎంతో ఎగ్జయిట్ అయిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer