నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ

0

తెలుగు సినిమా క్లాసిక్ సాంగ్ ఇది. జగపతిబాబు-సుకన్య జంటగా నటించిన ‘పెద్దరికం’ సినిమాలోనిది ఈ పాట. రాజ్ కోటి క్లాసిక్ బాణీ ఇప్పటికీ 90ల నాటి యవత గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చామంతి నవ్వు చూస్తే మళ్లీ ఆ క్లాసిక్ సాంగ్ గుర్తుకు రావాల్సిందే. అంత అందంగా నవ్వేస్తున్న ఈ పూబంతి పేరు అనన్య పాండే. సాహో విలన్ చుంకీ పాండే గారాల పట్టీ.

2018లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయ్యింది. తొలి చిత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. తదుపరి ‘పతి పత్ని ఔర్ వో’ అనే క్లాసిక్ రీమేక్ లో నటిస్తోంది. నవతరం స్టార్ల సరసన ఈ అమ్మడు పెర్ఫెక్ట్ ఆప్షన్ గా మారింది. జాన్వీ.. తారా సుతారియా సహా పలువురు డెబ్యూ నాయికలకు ఈ క్యూటీ ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. భుజాల పైనుంచి అలా ఆచ్ఛాదనే లేకుండా కిందికి జారిపోతోందా? అన్నట్టుగా ఉన్న ఆ పూబంతి డిజైనర్ డ్రెస్ లో ఒదిగిపోయిన తీరు కట్టి పడేస్తోంది. అనన్య పాండే సిగ్గులు మొగ్గలు పోతూ చిరునవ్వుతో కవ్విస్తోంది. ఇలా కవ్విస్తే డైరెక్టుగా టాలీవుడ్ కి టిక్కెట్టు కొట్టేసినట్టే. మన యువహీరోలు టెంప్ట్ అయ్యి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer