అరే నా పిల్లలతో ఎట్లుండాలో మీరు చెప్తారా – యాంకర్ ఆంటీ

0

బుల్లి తెరపై హల్ చల్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ యాంకర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయమై పోస్ట్ చేస్తూ ఉంటుందనే విషయం తెల్సిందే. కరోనా కారణంగా తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. ఆ విషయం కాస్త వైరల్ అయ్యింది. కరోనా కారణంగా చావు బతుకుతో పోరాడుతుంటే మినహాయింపు అడగడం ఏంటీ అంటూ పలువురు పలు రకాలుగా ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.

ఒక నెటిజన్ ‘ఎందుకు ఆంటీ చక్కగా పిల్లలతో మీ తీరిక సమయాన్ని వెచ్చించండి.. ఇలా ట్విట్టర్ లో జనాలతో కాకుండా..’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు అనసూయకు తీవ్రంగా కోపం వచ్చినట్లుగా ఉంది. ఆంటీ అనడం వల్లో లేదంటే మరేదో కారణం వల్లో కాని అతడికి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.

అనసూయ అతడి ట్వీట్ కు సమాధానంగా.. అరేయ్ నా పిల్లలతో ఎట్లుండాలో మీరు నాకు చెప్పేది ఏంట్రా అంకుల్ మరీ విడ్డూరం కాకపోతే అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు కొందరు మరింత ఘాటుగా సమాధానం చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తారు. వాటన్నింటిని పట్టించుకోవడం ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం అతడికి మంచి కౌంటర్ ఇచ్చారంటూ అభినందిస్తున్నారు. మొత్తానికి స్వీయ గృహ నిర్భందంలో ఉన్నా కూడా అనుష్క సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ తో యాక్టివ్ గానే ఉంటూ వస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-