అనసూయ బలపం పట్టి భామ ఒళ్లో చూశారా?

0

కారణం ఏమైనా కానీ.. తరచూ వార్తల్లో ఉండే సెలబ్రిటీలు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో అనసూయ ఒకరు. ఆంటీనే అయినా కాలేజీ పోరి లెక్కన హుషారు ప్రదర్శించే ఆమెను ఇప్పటివరకూ యాంకర్ గా బుల్లితెర మీదా.. నటిగా వెండితెర మీద చూసినోళ్లకు.. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో తనలోని మరో యాంగిల్ ను చూపించి ఇరగదీసింది అనసూయ.

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన అనసూయ.. యాంకరింగ్ రొమాంటిక్ గా ఎలా చేయాలో తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి. తన మాటలు.. చేతలతోనే కాదు.. తన వస్త్రధారణతో కిక్ ఇచ్చే అనసూయ తాజాగా ఒక షోలో ఏకంగా స్టెప్పులేసేసి అదరగొట్టేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చి హడావుడి చేస్తోంది.

అలనాటి హిట్ సాంగ్ బలపం పట్టి భామ ఒళ్లో పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసిన అనసూయ.. పాటలో లీనం కావటమే కాదు.. తన నడుమందాల్ని చూపించి ఘాటెక్కించారు. అక్కడితో ఆగని ఆమె.. ఈ పాటకు వేసిన స్టెప్పులు.. మూమెంట్స్ తో ఇప్పటివరకూ చూపించని సరికొత్త టాలెంట్ ను అనసూయ చూపించిందన్న మాట వినిపిస్తోంది. కావాలంటే.. ఈ ప్రోమోను చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఆలస్యం ఎందుకు.. కింది లింక్ ను క్లిక్ చేస్తే సరి.
Please Read Disclaimer