అప్పుడే అమ్మానాన్న ఒప్పుకుంటే ఏమయ్యేదో?

0

జబర్దస్త్ యాంకర్ అనసూయ బుల్లి తెరపైనే కాకుండా మెల్ల మెల్లగా వెండి తెరపై కూడా తనదైన శైలిలో ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది. రంగస్థలం చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అనసూయ లీడ్ రోల్స్ కూడా చేస్తోంది. తాజాగా కథనం చిత్రంలో హీరోయిన్ గా అనసూయ నటించింది. ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘కథనం’ సినిమా ప్రమోషన్స్ సందర్బంగా అనసూయ మీడియాతో మాట్లాడుతూ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సినిమాలో నేను ఒక చిన్న పాత్ర చేస్తానని నేను అనుకోలేదు. నా జీవితంలో నా ఫొటో ఒకటి అయినా పోస్టర్ పై ఉంటుందని నేను ఊహించలేదు. ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఒక పేపర్ యాడ్ చూసి నటిగా అప్లై చేశాను. పెళ్లికి ముందు చాలానే ఆఫర్లు వచ్చాయి. కాని అప్పుడు నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెళ్లి తర్వాత నా భర్త ప్రోత్సాహంతో నేను యాంకర్ గా మరియు సినిమాల్లో నటిగా ప్రేక్షకులను అలరిస్తున్నాను అంది.

ఒకవేళ పెళ్లికి ముందు అనసూయ తల్లిదండ్రులు నటనకు ఓకే చెప్పి ఉంటే హీరోయిన్ అయ్యి ఉండేదేమో. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు బుల్లి తెర కార్యక్రమాలకు హోస్టింగ్ చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు పలు సినిమాలను కూడా చేస్తోంది. కథనంతో ఇటీవలే వచ్చిన ఈమె తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఒక చిత్రంలో కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లు చాలా అనసూయ ముందుకు వస్తున్నాయట. ఆచితూచి అనసూయ కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. ఒక వైపు బుల్లి తెర మరోవైపు వెండి తెర చాలా అరుదుగా ఇలాంటి వారు ఉంటారు.
Please Read Disclaimer