గతం గతః అంటున్న రంగమ్మత్త!

0

విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పాపులర్ యాంకర్ కం టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇదేమీ సాధారణ విషయం కాదు.. ఎందుకంటే గతంలో ‘అర్జున్ రెడ్డి’ సమయంలో విజయ్ ప్రమోషన్స్ లో బూతులు వాడడంపై అనసూయ తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయ్ మాత్రం అనసూయపై ఎలాంటి కామెంట్లు చేయలేదుకానీ రౌడీ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేశారు.

రీసెంట్ గా ‘మీకు మాత్రమే’ చెప్తా ప్రమోషన్లలో భాగంగా ఇదే విషయం ప్రస్తావించినప్పుడు అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా తనకు నచ్చిందని.. గతంలో జరిగిన విషయం ఇటు తనపై కానీ అటు విజయ్ పై కానీ ప్రభావం చూపించలేదని చెప్పారు. అనసూయ కొత్త బ్యానర్లో నిర్మించే సినిమాకు పనిచేయడం తన పాలసీకి విరుద్ధమని.. అయినా ఈ సినిమాలో నటించానని మరో విషయం కూడా చెప్పుకొచ్చారు.

నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సమయంలో అనసూయ చేసిన రచ్చ అంతా బూతుల వాడకం సరికాదు అనేదానిపైనే. ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రోమోస్ చూస్తే అనసూయకు సిమిలర్ షేడ్స్ ఉండే పాత్ర ఇచ్చారని అర్థం అవుతుంది. “ఇలాంటివాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు.. కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు.. వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు.. అన్నీ దాచేసి దొరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు” అంటూ మగ జాతిపై కత్తికట్టిన మహిళ లాగా టీజర్లో రెచ్చిపోయింది.. అ పాత్రకు సరిగ్గా సూట్ అయింది. నిజానికి అందుకే ఈ పాత్రకు విజయ్ అనసూయను ఎంచుకున్నాడేమో!
Please Read Disclaimer