అనసూయ ఆంటీ అయినా అవే ఒంపులు

0

హాట్ జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక వైపు బుల్లి తెరపై సందడి చేస్తూనే మరో వైపు వెండి తెరపై ఏదో సాధించాలనే ప్రయత్నాలు చేస్తోంది. రంగమ్మత్త వంటి మరో మంచి పాత్ర కోసం ఈ అమ్మడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఇంకా హీరోయిన్ గా నటించేందుకు గ్లామర్ ఉంది.. ఆసక్తి ఉంది అని చెప్పకనే చెప్పేందుకు ఈ అమ్మడు ప్రతి వారం రెండు మూడు ఫొటో షూట్స్ స్టిల్స్ అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.

తాజాగా ఈ అమ్మడు ఆరంజ్ కలర్ చీర కట్టుతో తీయించుకున్న ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా.. పిల్లలు పెద్ద వారు అవుతున్నా కూడా అనసూయ నడుము వంపులు ఏమాత్రం తగ్గలేదు అని.. స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చే ఆమె ఫిజిక్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందమైన కరెక్ట్ ఫిజిక్ కు నిలువెత్తు నిదర్శనం అనసూయ అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అనసూయ ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఒక సినిమా చర్చల దశలో ఉంది. మరో వైపు చిరంజీవి 152వ చిత్రంలో కూడా ఈమె నటించబోతున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. మళ్లీ వార్తలపై క్లారిటీ అయితే రాలేదు. ఇవే కాకుండా ఐటెం సాంగ్స్ మరియు సినిమాల్లో కీలక పాత్రలు చేసేందుకు కూడా అనసూయ రెడీగా ఉంది. తనలోని ట్యాలెంట్ ను ఎంత వాడుకోవాలనుకుంటే అంత వాడుకోవచ్చు అంటూ హింట్ ఇస్తున్నట్లుగా అనసూయ ఫొటో షూట్స్ ఉంటున్నాయనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
Please Read Disclaimer