వైట్ లో కిల్లింగ్ అనసూయ

0

రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు.. రామలక్ష్మి పాత్రలకు ధీటుగా రంగమ్మత్త కు పాపులారిటీ దక్కింది. ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిన అనసూయకు కెరీర్ పరంగా బోలెడంత మైలేజ్ వచ్చింది. వరుసగా ఛాన్సులిచ్చేందుకు యువదర్శకులు పోటీపడడంతో అటు బుల్లితెరను మించి వెండితెరపై ఛాన్సులు అందుకుంటోంది. లక్షల్లో పారితోషికాలు అందుకుంటూ కెరీర్ బండిని ముందుకు నడిపిస్తోంది.

`కథనం` చిత్రంలో లీడ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పు పొందింది. ప్రస్తుతం పలువురు యువదర్శకుల నుంచి అనసూయకు పిలుపు అందిందని.. కథలు వింటోందన్న ప్రచారం సాగుతోంది. బుల్లితెర కంటే అనసూయ వెండితెరకే ప్రాధాన్యతనిస్తుండడం .. ఇతరత్రా కారణాల వల్ల జబర్ధస్త్ షో నుంచి వైదొలగిందని మరోవైపు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే జబర్ధస్త్ షో నుంచి జడ్జి నాగబాబు కూడా బయటికి వెళుతున్నారు. ఆయనతో పాటే అనసూయ బయటపడుతోందన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఇకపోతే అనసూయ ట్రయల్స్ చూస్తుంటే ఇకపై పెద్ద తెరతో పాటు వెబ్ సిరీస్ ల బాటలోనూ బిజీ కానుందని అర్థమవుతోంది. తాజాగా వైట్ అండ్ వైట్ లుక్ లో ఈ అమ్మడు అదిరిపోయే ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. రకరకాల భంగిమల్లో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ తో రంగమ్మత్త అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రకారు సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer