మెగా 152కి అనసూయ దూరం.. నాగబాబు చక్రం తిప్పాడా?

0

చిరంజీవి 152వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పటి నుండి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రను అనసూయ చేత చేయించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రకు ఫిదా అయిన చిరంజీవి తన సినిమాలో ఆమెను నటింపజేయాలని అనుకున్నాడట. అలా కొరటాల చెప్పిన కథలో ఒక పాత్రకు ఆమె అయితే బాగుంటుందని చిరంజీవి భావించి కొరటాలకు ఆమెను సిఫార్సు చేయడం జరిగింది అంటూ ప్రచారం జరిగింది.

తీరా సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మెగా 152లో అనసూయ లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం నిన్నటి తరం హీరోయిన్ ను తీసుకున్నారని.. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా పూర్తి అయ్యాయి అంటున్నారు. అలాగే ఆ పాత్ర నిడివి కూడా పెంచి ఆ సీనియర్ హీరోయిన్ తో చేయించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఉన్నట్లుండి మెగా మూవీ నుండి అనసూయను ఎందుకు తప్పించినట్లుగా అంటూ చర్చ జరుగుతుంది.

సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఈ విషయమై విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయిన నాగబాబు అదిరింది ని షురూ చేశాడు. అదిరిందికి అనసూయను యాంకర్ గా చేయమంటూ నాగబాబు కోరాడట. అందుకు అనసూయ నో చెప్పిందని అందుకే హర్ట్ అయిన నాగబాబు చిరంజీవి సినిమా నుండి తప్పించేలా చక్రం తిప్పాడు అంటూ కొందరు నెట్టింట వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విషయం ఏంటో కాని పుకార్లు అయితే ప్రస్తుతం నెట్ లో షికార్లు చేస్తున్నాయి. ఆమెను తొలగించడం వెనుక కారణం చిత్ర యూనిట్ సభ్యులు చెబితే కాని తెలియదు.
Please Read Disclaimer