కరోనా పై అనసూయ ఫుల్ హ్యాపీ

0

కరోనా అన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ప్రజల మైండ్ సెట్ లో ఎంతో మార్పును తీసుకొచ్చింది. కరోనాతో వచ్చే ముప్పు ఎంతన్న విషయం పై చాలా మందికి అవగాహన లేనప్పటికీ.. అందరి మాదిరి భయపడే విషయంలో మాత్రం ఎవరికి వారు ముందుంటున్నారు. ‘ఎందుకైనా మంచిది’.. ‘ముందస్తు జాగ్రత్త’ పేరుతో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కరోనా భయాందోళనలు సామాన్యులకు అనుభవం ఒకలా ఉంటే.. సెలబ్రిటీలకు మరోలా ఉంది. క్షణం తీరిక లేకుండా తిరిగే సెలబ్రిటీలు ఎంచక్కా ఇంట్లోనే ఉండిపోవటమే కాదు.. ఎంచక్కా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు.

కరోనా పుణ్యమా అని ఫ్యామిలీ తో క్వాలిటీ టైం గడిపే అవకాశాన్ని ఇచ్చిందంటూ చెబుతోంది హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ. సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉండటమే కాదు.. తరచూ తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేయటంలో ఆమెకున్న టాలెంట్ అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఈ బ్యూటిఫుల్ ఆంటీకి మాత్రం మరోలాంటి అనుభవాన్ని మిగిల్చినట్లు చెబుతోంది.

తెలంగాణలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైన వెంటనే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా పలువురు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకుంటే.. మరికొందరు లీవ్ పెట్టేశారు. సామాన్యులే ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటే.. సెలబ్రిటీలు మరెంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. దీనికి తగ్గట్లే అనసూయ తాను ఇంటికే పరిమితమయ్యానని.. చాలా రోజుల తర్వాత ఇంట్లోనే క్వాలిటీ టైం గడుపుతున్నట్లు చెప్పింది. పిల్లలతో హాయిగా గడుపుతున్నానని చెబుతూ.. తాను ఇప్పటికే చూసేసిన అవేంజర్స్ ఎండ్ గేమ్ మూవీని మరోసారి చూసినట్లుగా చెప్పింది.

కరోనా తో పానిక్ అయ్యే కంటే.. ఇలా ఇంట్లో వారందరి తో కలిసి ఉన్నామన్న ఫీలింగ్ పెంచేసుకుంటే.. కరోనా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా ఎవరికి తెలీదని సెలవిస్తోంది. కరోనా పుణ్యమా అని కుటుంబంతో కలిసి ఉండే అవకాశం దక్కటంతో అనసూయ ఎంత హ్యాపీగా ఉన్నారన్న విషయం ఆమె తాజా ట్వీట్ చెప్పేస్తుందని చెప్పాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-