‘టాలీవుడ్’లో నేపోటిజం వలనే అవకాశాలు కోల్పోయాను: అనసూయ

0

Anchor Anasuya Comments on Nopotism in Telugu Film Industry

Anchor Anasuya Comments on Nopotism in Telugu Film Industry

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పై సినీ అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అంతా సంతాపం తెలిపారు. అసలు మంచి కెరీర్ ఉన్న సుశాంత్ అలా ఎందుకు చేశాడా.. అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సుశాంత్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్నీ ఇండస్ట్రీలలో చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు కొందరు గుప్పిస్తుండగా.. తాజాగా నెపోటిజం పై టాలీవుడ్ యాంకర్ అనసూయ స్పందించింది. ఇప్పుడిప్పుడే టీవీలో యాంకరింగ్ వైపు నుండి సినీ ఇండస్ట్రీలో నటిగా బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అనసూయ. ఎప్పుడో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఇన్నేళ్ల తర్వాత రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త క్యారెక్టర్ తో మంచిగుర్తింపు సంపాదించుకుంది.

కానీ అనసూయ కూడా ఇండస్ట్రీలోని నేపోటిజం ఫేవరేటిజం వలన ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయాయని నేపోటిజం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ బంధుప్రీతి పై నడుస్తున్న చర్చలు చూసి తను కూడా నోరు విప్పింది. పైగా ప్రతీ రంగంలోనూ అలానే ఉంటుందని.. తల్లీదండ్రులు వారి వారసత్వాన్ని కొడుకులకు ఇస్తారని చెప్పుకొచ్చింది భామ. నేపోటిజం వలనే తనలాంటి బయటి నుండి వచ్చిన నటులు అవకాశాలు కోల్పుతున్నామని చెప్పింది. ఇండస్ట్రీలో కష్టపడి పనిచేసే వారికి కెరీర్ పై ఆశలతో వచ్చిన వారికి చేదు అనుభవాలే ఎదురవుతాయని చెబుతోంది అనసూయ. ఇండస్ట్రీలో నేపోటిజంతో పాటు ఫేవరెటిజం కూడా ఉందని అందువల్లనే తను కెరీర్ మొదటి నుండి చాలా ఛాన్సులు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది యాంకరమ్మ. ప్రస్తుతం ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న అనసూయ గతేడాది రంగమ్మత్త పాత్రకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.