అడవిలో అనసూయ.. భర్త, పిల్లలతో జంగల్ సఫారీ

0

టీవీ షోలతో, సినిమాలతో బిజీగా ఉండే యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా భర్త, తన ఇద్దరు పిల్లలతో విహార యాత్రలకు వెళ్తుంటారు. అయితే ఈసారి తన కుటుంబంతో కలిసి ఆమె జంగల్ యాత్రకు వెళ్లారు.

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధేరి నేషనల్ పార్క్‌లో జంగిల్ ట్రెక్కింగ్ చేశారు. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. తన సొంత ఆడి కారులోనే రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి చంద్రపూర్‌కి రోడ్డు ట్రిప్ వేశారు. అడవిలో తన పిల్లలు, భర్త, అమ్మానాన్నలతో కలిసి ప్రకృతి అందాలను అస్వాదించారు అనసూయ. ఈ మేరకు అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


‘‘రోడ్ ట్రిప్‌లో గొప్ప విషయం ఏంటంటే గమ్యాన్ని చేరుకోలేకపోవడం. ఈ ట్రిప్ నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ ట్రిప్‌లో నేను ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాను. ఇలాంటి ప్రకృతి లేకుండా నేను బతలేనని నాకు అనిపించింది. నేను క్యాప్చర్ చేసిన వాటిలో కొన్ని ఇవి. చాలా జ్ఞాపకాలు నా హృదయంలో ఉన్నాయి. వాటిలో నేను ఎంతగానో మునిగిపోయాను అందుకే వాటిని క్లిక్ చేయలేకపోయాను’’ అని అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. అవి గురువారం ప్రసారమైన ‘జబర్దస్త్’ షోలో యాంకర్ స్టిల్స్. బ్లూ కలర్ షార్ట్ కటింగ్ డ్రెస్‌లో అనసూయ స్టిల్ అదిరిపోయింది. ఆ ఫొటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అంతే అందంగా ఉంది. ‘‘నాకు కలలు లేవు.. లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

I don’t have dreams.. I have goals. Bossed up for #Jabardast #tonyt in @gaurinaidu 🤎 PC: @valmikiramu 🔥

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on
Please Read Disclaimer