కాక రేపుతున్న రంగమ్మత్త

0

బుల్లితెరపై హాట్ యాంకరింగ్ తో ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసిన హాట్ లేడీ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. అప్పట్లో ‘క్షణం’ లో నటించి అందరినీ మెప్పించింది. లాస్ట్ ఇయర్ ‘రంగస్థలం’ లోని రంగమ్మత్త పాత్ర అనసూయకు ఎంత పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. రంగమ్మత్త పాత్ర క్లిక్ కావడంతో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల తాజా సినిమాల్లో అనసూయకు ఆఫర్లు దక్కాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తరచుగా ఏదో ఒక అప్డేట్లు ఇస్తూ.. హాటు ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటుంది. తాజాగా మరోసారి అదేపని చేసింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంది. అక్కడ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. సహజంగా ఫోటో షూట్ అంటే లొకేషన్ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ ఫోటోషూట్ ప్రత్యేకత లొకేషన్ కాదు. నేపథ్యంలో ఉన్న డార్క్ కలర్ స్పోర్ట్స్ కారు. దీన్ని బ్యాట్ మొబైల్ కార్ అంటారు. 1989 లో రిలీజ్ అయిన ‘బ్యాట్ మాన్’ చిత్రంలో ఈ మోడల్ కారును వాడడం జరిగింది. రంగమ్మత్త షేర్ చేసిన ఫోటోలలో కాకుండా కింద ఉండే ఫోటోలో ఆ కారును మీరు క్లియర్ గా చూడవచ్చు.

ఇంత స్పెషాలిటీ ఉంది కాబట్టే రంగమ్మత్త తన ఫోటోలకు బ్యాక్ గ్రౌండ్ గా ఆ కారునే ఎంచుకుంది. ఈ ఫోటోలో ఒక షర్టు డిజైన్లో గౌన్ ధరించి కారుతో పోజులిచ్చింది. తను ధరించిన డ్రెస్సు ‘రా సిల్క్ సూట్ డ్రెస్’ అని క్యాప్షన్ లో వెల్లడించింది. హాటు లేడీ కదా.. ఈరోజుకు ఇంతటితో సరిపెట్టుకోండి అన్నట్టుగా కాళ్ళ అందాలను మాత్రమే ప్రదర్శించింది. ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “ఫెరారీ పవర్ ఇంజిన్”.. “కాక రేపుతున్న రంగమ్మత్త”.. “బ్యాట్ మొబైల్ సూపర్ గర్ల్” అంటూ కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer