అనసూయ ఫుల్ సీరియస్.. కారణమిదే!

0

బుల్లితెరకు సరికొత్త గ్లామర్ ని అద్దిన అందాల యాంకర్ గా అనసూయ పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు. అన్ లమిటెడ్ ఆఫర్ లా గ్లామర్ స్టఫ్ ని పీక్స్ కి తీసుకెళ్లిన హాట్ యాంకర్ గా తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించి మరింతగా ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇక అనసూయ జబర్ధస్త్ అనే రియాలిటీ షోతోనూ టీవీక్షకులకు బాగా సుపరిచితం.

అయితే గత కొంతకాలంగా జబర్ధస్త్ షోకి సంబంధించిన రకరకాల అంశాల్ని శ్యాంప్రసాద్ రెడ్డి బృందం ప్రక్షాళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఆర్పీ తగ్గడం.. ఈ మాస్ షోకి ప్రత్యామ్నాయంగా ఇతరత్రా రియాలిటీ షోల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడంతో అక్కడ సరికొత్త పరిణామాలు వేడెక్కిస్తున్నాయి. ఇటీవలే జబర్ధస్త్ షో నుంచి వైదొలగుతున్నట్టు జడ్జి నాగబాబు ప్రకటించారు. ఈ షోతో ముడిపడి ఉన్న అనుబంధం కారణంగా ఎమోషన్ ని దాచుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. దీనిపై సోషల్ మీడియా వైరల్ గా కథనాల్ని వండి వార్చింది. పనిలో పనిగా నాగబాబుతో పాటుగా ఈ షో నుంచి యాంకర్ అనసూయ వైదొలగుతోందని అంతే ఇదిగా ప్రచారం సాగిపోయింది.

అయితే దీనిపై తాజాగా అనసూయ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ .. ఇదంతా పనిలేని పోతరాజుల పని అంటూ తిట్టేయడం చర్చకు వచ్చింది. ఉద్యోగాల్లేని వాళ్లు చేస్తున్న ప్రచారమిది. కొందరు విలన్ల పని! అంటూ గుంభనగా మాట్లాడడం వేడెక్కిస్తోంది. దేవుని దయవల్ల నేనింకా బాగానే ఉన్నాను! అంటూ సెటైరికల్ గానూ అనసూయ స్పందించారు. మొత్తానికి జబర్ధస్త్ నుంచి ఈ హాట్ యాంకర్ వెళ్లిపోవడం లేదు అన్నది తిరిగి అభిమానుల్లో ఆశలు నింపుతోంది. అన్నట్టు అనసూయ ఉద్యోగం కూడా గోవిందా! అని ప్రచారం చేసిన ఆ విలన్ ఎవరై ఉండొచ్చంటారు?
Please Read Disclaimer