కాల్చి వాత పెట్టినట్లుగా బదులిచ్చిన అనసూయ!

0

అభిమానం తప్పు లేదు కానీ.. ఆ పేరుతో ప్రదర్శించే అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అలాంటి విషయాల్లో తనకున్న టాలెంట్ మామూలు కాదన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించింది ప్రముఖ యాంకర్ కమ్ సినీ నటి అనసూయ. తరచూ ఏదోలా వార్తల్లో ఉండే ఆమెకున్న అభిమానగణం ఎంత భారీ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఆమె మీద అభిమానాన్ని ప్రదర్శించే క్రమంలో పలువురు అభిమానులు ఆమెను ఉద్దేశించి.. అనసూయ తొందరగా పెళ్లి చేసుకుంది.. లేదంటే మంచి హీరోయిన్ అయి ఉండేదంటూ చేస్తున్న వ్యాఖ్యలకు కాల్చి వాత పెట్టేలాంటి మాట చెప్పింది అనసూయ.

జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత సాధించినా.. ఎంత సంపాదించిన తర్వాత అయినా ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేందుకే కదా? అని ప్రశ్నించి ఆమె.. అది తనకు ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. తాను సాధించిన.. సంపాదించిన పేరు ప్రఖ్యాతుల కంటే కూడా గొప్పది తన కుటుంబమని పేర్కొంది.

ఈ సందర్భంగా తన భర్త.. పిల్లలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె.. తాను జీవితంలో పొందిన వాటికి బాధ పడటం లేదని స్పష్టం చేసింది. పని విషయంలో మగవాళ్లకు లేని హద్దులన్ని ఆడవాళ్లకే ఎందుకని ప్రశ్నించారు. మొత్తానికి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావ్.. లేదంటేనా? ఇరగదీసే దానివంటూ పనికిమాలిన మాటల మళ్లీ రాకుండా ఉండేలా అనసూయ తన స్పందనతో వాతలు పెట్టిందని చెప్పాలి.
Please Read Disclaimer