ట్రంపు ల్యాండులో జబర్ధస్త్ పోజు

0

తెలుగు టీవీ యాంకర్లు అంటే ట్రెడిషనల్ గానో.. స్టైలిష్ గానో ఉంటారు అనే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా హాటుగా కూడా ఉంటారు అని గట్టిగా ప్రూవ్ చేసిన జబర్ధస్త్ లేడీ అనసూయ భరద్వాజ్. యాంకర్ గా భారీ పాపులారిటీ సాధించిన అనసూయ హిట్ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. వీటికి తోడుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా అభిమానులకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.

ప్రస్తుతం అనసూయ అమెరికా ట్రిప్ లో ఉంది.. వర్క్ లో ఉంటేనే సూపర్ ఫన్ గా ఉండే అనసూయ హాలిడేస్ లో డబల్ ఫన్ గా ఉంటుంది కదా. అలానే సియాటిల్ లోని పైక్ ప్లేస్ మార్కెట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అమెరికా కదా.. స్టైల్ పెంచాలని డిసైడ్ అయిందో ఏమో కానీ ఒక పొట్టి గౌన్ ధరించింది. మెడలో ఒక స్కార్ఫ్ ను స్టైల్ గా కట్టుకుంది. రెండు చేతులో పైకెత్తి ‘ఆ..ఆ’ అంటూ నోరు తెరిచింది. ఇక ఈ ఫోటోకు అనసూయ ఇచ్చిన క్యాప్షన్ అద్భుతః..”జీవితం అంటే చాలా విషయాలు.. ప్రాధాన్యతలు తెలుసుకోండి.. 1. సరదాగా ఉండండి 2. సర.. దాగా ఉండండి. 3 టన్నులలో 1&2 కలిపి చేయండి” అంటూ ఫ్రస్ట్రేషన్ సమాజానికి ఒక ఫన్నీ మెసేజ్ ఇచ్చింది. ఈ రంగమ్మత్త మెసేజ్ కనుక సరిగ్గా ఫాలో అయితే చాలామందికి టెన్షన్లు ఉండవు.

ఈ ఫోటోకు.. ఆ కోటేషన్ దెబ్బకు చాలామంది నెటిజన్లు ఫిదా అయ్యారు. “హాలీవుడ్ నటిలా ఉన్నావు”.. “లవ్లీ డ్రెస్.. హ్యాపీ సోల్”..”అంతేగా అంతేగా” అంటూ తమ స్పందన తెలిపారు. అయితే ఒకరికి మాత్రం ఈ రంగమ్మత్త వేషాలు నచ్చలేదు. అందుకే “పక్కన ఉండేవారి డ్రెస్సులు చూడు.. చక్కగా ఉన్నారు. నువ్వు ఎక్కడున్నా తేడానే” అంటూ తిట్టిపోశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. మరో టైటిల్ పెట్టని సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది.
Please Read Disclaimer