ప్రదీప్ మాచిరాజు కోసం టికెట్ కొంటారా?

0

బుల్లితెరలో యాంకర్లుగా భారీ గుర్తింపు సాధించినవారిలో కొందరు వెండితెరపై తమ అదృష్టం పరిక్షించుకున్నారు. కానీ వారిలో ఎవరూ విజయం సాధించిన దాఖలాలు లేవు. ఏవో ఛోటా మోటా సినిమాలు చేసి పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో తిరిగి టీవీ రంగంలోకే తిరిగి వెళ్ళిపోయారు. ముఖ్యంగా టీవీ యాంకర్స్ నటులు ఎవరూ టాలీవుడ్ లో విజయం సాధించలేదు. అయితే టాలీవుడ్ లో హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్న ప్రదీప్ మాచిరాజు మాత్రం డిఫరెంట్ గా వస్తున్నాడని అంటున్నారు.

ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఈ సినిమాలో ఇతర పాటలకు కూడా మంచి స్పందన దక్కుతోంది. అయితే సినిమాలో కంటెంట్ ఎలా ఉందన్నదే పెద్ద డౌట్.

ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి గీతా ఆర్ట్స్ వారు ముందుకు రావడం ఆసక్తికరమైన అంశమే కానీ అంతమాత్రాన మంచి సినిమా అవుతుందని గ్యారెంటీ లేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఆది సాయి కుమార్ సినిమా ‘నెక్స్ట్ నువ్వే’ ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమా అందరికీ రీచ్ కావాలంటే స్ట్రాంగ్ ప్రమోషన్స్ చెయ్యాలి. ప్రదీప్ ను బుల్లితెరపై అభిమానించే ప్రేక్షకులు టికెట్ కొనుక్కుని థియేటర్ కు రావాలంటే ఆ స్థాయిలోనే ప్రచారం చేపట్టాలి. ఇప్పటి వరకూ అయితే ప్రచారంలో జోరు కనిపించడం లేదు. మరి రిలీజ్ లోపు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-