మూగజీవాలపై పశువాంఛ.. వైరల్ వీడియోపై రష్మి ఆవేదన

0

జబర్దస్త్ కామెడీ షోతో క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కాస్త ఎక్కువే. చాలా మంది సెలబ్రిటీల్లా నాకెందుకులే అని స్మార్ట్ ఫోన్ కీబోర్డ్‌ను సవరించకుండా ఉండలేదు. సమాజంలో నేను కూడా అన్నట్టుగా సామాజిక బాధ్యతల్ని పలు సందర్భాల్లో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక పర్యావణం, నోరు లేని మూగజీవాలంటే రష్మికి మహా ఇష్టం. హోలీ సందర్భంగా రష్మి చేసిన ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.. రంగులు చల్లుకోవాలంటే మనుషులపై చల్లుకోండి.. మూగ జీవాలపై కాదు’ అంటూ అందర్నీ ముందే అలర్ట్ చేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది రష్మి.

అయితే ఓ యువకుడు మూగజీవంపై పశువాంఛ తీర్చుకుంటున్న వీడియో ఒకటి రష్మి కంట పడతంతో ‘మనం ఎక్కడికి పోతున్నాం’ అంటూ ప్రశ్నిస్తూ ఆవీడియోపై స్పందించింది రష్మి. ‘స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బొంబే’ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ‘ఓ యువకుడు లేగదూడపై పశువాంఛ తీర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా.. బీజేపీ ముఖ్య నాయకులతో పాటు అనుష్క శర్మ, సోనమ్ కపూర్, జాన్ అబ్రహాం, విరాట్ కోహ్లీ, శ్రద్ధా కపూర్, అలియా బట్, సన్నీ లియోన్, రష్మి గౌతమ్‌లను ట్యాగ్ చేయడంతో వీళ్లలో రష్మి స్పందిస్తూ.. ఈ వీడియోను రీ ట్వీట్ చేసి ఆ మూగ జీవంపై పశువాంఛ తీర్చుకుంటున్న యువకుడి గుట్టును బయటపెట్టింది.


రష్మి చేసిన ఈ ట్వీట్‌పై జంతు ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఆ యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు నెటిజన్లు. దీంతో పాటు.. వైజాగ్‌లో ప్రహ్లాదపురంలో మూడు కుక్కపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వాటి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని రష్మి సాయం కోరడంతో స్పందించిన రష్మి.. మీ ఫోన్ నంబర్ పంపించండి సాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తా’ అంటూ రిప్లై ఇచ్చింది రష్మి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-