యాంకర్ రవి కార్ ప్రమాదం

0

బుల్లితెర పాపులర్ యాంకర్ రవి వివాదాల గురించి పరిచయం అవసరం లేదు. ఇంతకుముందు చలపతిరావు ఉదంతంతో వైరల్ గా వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి రవి వార్తల్లోకొచ్చాడు. రవి ప్రయాణిస్తున్న కార్ రద్దీ రోడ్ లో ప్రమాదానికి గురైంది. మూసాపేట పరిధిలోని భరత్ నగర్ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదంలో పొరపాటు ఎవరిది అన్న వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో రవి తప్పు లేదు కానీ.. డీసీఎం వ్యాన్ ర్యాష్ గా వచ్చి రవి కారుని ఢీ కొట్టింది. దీంతో రవికారుకు స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. దీంతో ఆగ్రహించిన రవి వ్యాన్ డ్రైవర్ తో గొడవకు దిగాడు. అయితే డీసీఎం క్లీనర్ ఫుల్లుగా మద్యం సేవించి వున్నట్లు తేలింది. వెంటనే కూకట్ పల్లి పీఎస్ తో పాటు సనత్ నగర్ పీఎస్ కి ఫోన్ చేసిన విషయం చెప్పిన రవి అక్కడి నుంచి డైరెక్ట్ గా పీఎస్ లకు వెళ్లాడు. ఇది గమనించి డీసీఎం డ్రైవర్.. క్లీనర్ అక్కడే డీసీఎంని వదిలేసి పారిపోయారు.

దీంతో ఆగ్రహానికి గురైన రవి ఇలాంటి వారి వల్లే నిత్యం రేప్ లు జరుగుతున్నాయని మండిపడ్డాడు. రవి కాస్త పెద్ద డోస్ తోనే తిట్టేశాడు. ఈ తతంగాన్నంతా స్వయంగా రవి వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer