కింగ్ తో పోటీ ఏంటి.. పిచ్చి కాకపోతే!

0

తన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ డే కి.. తాను నటించిన సినిమా రిలీజైతే ఏ అభిమాని ఫీలింగ్ అయినా ఎలా ఉంటుంది? ఓకింత గర్వంతో పాటు.. ఓ మోస్తరు ఇబ్బంది కూడా తప్పదు. ప్రస్తుతం అలాంటి సన్నివేశాన్నే ఎదుర్కొంది అనసూయ. ఇలాంటి సందర్భంలో ఆనందంతో కూడుకున్న ఇబ్బందికి ఉబ్బితబ్బిబ్బవ్వాలా? లేక సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ ని ఎదుర్కోవాలా? అన్న కన్ఫ్యూజన్ లో ఉంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. కాస్త డీప్ గా లోనికెళ్లాలి.

కింగ్ నాగార్జున- యాంకర్ కం నటి అనసూయ మధ్య ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. పైగా నాగార్జునకు అనసూయ వీరాభిమాని. అప్పట్లో `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రంలోనూ నాగ్ తనకో ఛాన్సిస్తే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. అందుకే నాగార్జున నటించిన `మన్మధుడు 2` రిలీజవుతున్న రోజే అనసూయ నటించిన `కథనం` (రాజేష్ నాదెండ్ల దర్శకుడు) రిలీజ్ కి రెడీ అవుతుండడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరో సినిమాకి అనసూయ సినిమా పోటీ పడుతుందా? అంటూ ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. కింగ్ తో హాటీ పోటీ అంటూ ఒకటే ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై అనసూయ తనదైన శైలిలో స్పందించారు. “నేను నాగార్జున సర్ తో పోటీ పడటమేంటి? పిచ్చికాకపోతేను. మన్మథుడు 2 ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఇష్టమైన నాగార్జున- రకుల్ ప్రీత్ – రాహుల్ రవీంద్రన్- వెన్నెల కిశోర్ సినిమాలో ఉన్నారు. నా `కథనం`తో పాటు అదే రోజున `మన్మథుడు 2` కూడా చూస్తాను“ అంటూ కింగ్ నే ఐస్ చేసేసింది. `మన్మధుడు 2` ట్రైలర్ బావుందని ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేసింది అనసూయ. దీనికి ప్రతిగా స్పందించిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తనకు కృతజ్ఞతలు తెలిపారు. “థాంక్ యూ అనూ.. నీక్కూడా అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా“ అని వ్యాఖ్యానించాడు రాహుల్. మొత్తానికి ఫేవరెట్ హీరోకి అనసూయ ఆల్ ది బెస్ట్ చెబితే.. తనకు అవతలివాళ్లు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారన్నమాట!!!
Please Read Disclaimer