బిగ్ బాస్ హౌస్ లో అక్క.. కన్ఫర్మ్ చేసేసింది

0

గడిచిన కొద్ది రోజులుగా బిగ్ బాస్ -3కు సంబంధించిన వార్తలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలో సృష్టించిన హడావుడి అంతాఇంతా కాదు. ఒక రియాల్టీ షోకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు రాకూడదో.. అలాంటివన్నీ రావటం ద్వారా ఈ షో మీద జరిగిన చర్చ.. రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ -3లో కంటెస్టెంట్లు ఎవరన్న విషయం మీద చాలానే అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి లిస్ట్ చాలాసార్లు వార్తల రూపంలో వచ్చినా.. ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడి కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక యాంకర్ తాను బిగ్ బిస్ షోలో సెలెక్ట్ అయిన విషయాన్ని తన పోస్ట్ తో చెప్పకనే చెప్పేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆమె పోస్ట్ చేశారు. అయితే.. ఆ వెంటనే ఆమె తన పోస్ట్ ను తొలగించారు. ఇంతకీ ఆ యాంకరమ్మ ఎవరో కాదు.. వీ6 ఛానల్ లో తన షోతో తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన సావిత్రి అక్క అలియాస్ శివజ్యోతి. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఉంటారన్న మాట గడిచిన కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

దీన్ని కన్ఫర్మ్ చేసినట్లుగా ఆమె తన పోస్ట్ తో చెప్పినా.. ఆ వెంటనే డిలీట్ చేసేశారు. పదిహేను మంది సభ్యులు బిగ్ బాస్ ఇంట్లో 100 రోజులు ఉండటం.. మధ్యలో ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లిపోవటం తెలిసిందే. చివరకు మిగిలిన సభ్యుల్లో ఒకరిని బిగ్ బాస్ షో విజేతగా ప్రకటిస్తారు. వచ్చే ఆదివారం ప్రారంభం కానున్న ఈ షోకు సంబంధించి హౌస్ కు ఎంపికైన వారికి సంబంధించిన పేర్లు ఆసక్తికరంగా మారాయి.

కింగ్ నాగార్జున ప్రయోక్తగా ఉన్న ఈ షోలోపాల్గొనే కంటెస్టెంట్లలో ముఖ్యమైన కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వారెవరంటే..

+ సావిత్రి అక్క అలియాస్ శివజ్యోతి

+ యాంకర్ శ్రీముఖి

+ నటి హేమ

+ వరుణ్ సందేశ్

+ వితికా షేరు

+ పాత్రికేయుడు జాఫర్

+ ఉయ్యాల జంపాలా ఫేం పునర్నవి భూపాలం

+ నటి హిమజ

+ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు
Please Read Disclaimer