తెలుగు భామ గ్లామర్ ఒలికించిందే!

0

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లయ’.. ‘అభిషేకం’.. ‘హ్యాపీ డేస్’.. ‘మా ఊరి వంట’.. ‘పట్టుకుంటే పట్టుచీర’.. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ లాంటి సీరియల్స్.. షోస్ ద్వారా చాలా పాపులారిటి సాధించింది. ‘లౌక్యం’.. ‘ఒక లైలా కోసం’.. ‘గుండెల్లో గోదారి’.. లాంటి సినిమాల్లో కూడా నటించి సినిమా రంగంలో తన సత్తా చాటింది. ఇక బిగ్ బాస్ 2 లో కూడా పాల్గొంది. ఈ కాకినాడ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

తాజాగా శ్యామల తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఇవి ‘మన్మథుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్న పాల్గొనడం కోసం చక్కగా రెడీ అయి తీయించుకున్న ఫోటోలు. ఈ ఈవెంట్ కోసం శ్యామల ఎంతో అందంగా రెడీ అయి.. కాస్త గ్లామర్ కూడా ఒలికించింది. క్రీమ్ కలర్.. లైట్ పింక్ కాంబినేషన్ ఉన్న డీప్ వీ నేక్ గౌన్ లో సూపర్ పోజులిచ్చింది. గ్లామర్ తో పాటుగా ఈ ఫోటోల్లో మరో ఆకర్హైషించే అంశం మాత్రం శ్యామల చేతులకున్న ట్రెడిషనల్ గోరింటాకు. ఎంతోమంది బ్యూటీలు ఉంటారు కానీ వారందరూ కోన్ తో చేతులకు స్పెషల్ డిజైన్స్ వేయించుకొని పోజిలిస్తారు. ఇలా అచ్చతెలుగు స్టైల్ లో కనిపించడం మాత్రం అరుదు.

ఈ ఫోటోలకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరేమో “అందంగా ఉన్నావు.. డ్రెస్ సూపర్”.. “హాట్ తెలుగు బ్యూటీ” అంటూ మెచ్చుకోగా.. మరికొందరు “నువ్వు బాలీవుడ్ హీరోయిన్ అనుకుంటున్నావా?”.. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటావు అనుకోలేదు” అంటూ తమ అసహనం వ్యక్తం చేశారు.
Please Read Disclaimer