శ్రీముఖి ప్లానింగ్ మామూలుగా లేదుగా!

0

బిగ్ బాస్ సీజన్ త్రీ మొదలైంది. పదిహేను మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఉండే సవాల్ షురూ అయ్యింది. అందరి అంచనాలకు తగ్గట్లే పదిహేను మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారు. పదిహేను మంది కంటెస్టెంట్లలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి తీరు చూస్తే..బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటానికి ముందు నుంచే భారీ ప్లానింగ్ లో ఉన్నట్లుగా కనిపించక మానదు.

ఇప్పటికే తన ఆర్మీని రెఢీ చేసుకున్న ఆమె.. తాజాగా తన టాలెంట్ ను ఒక వీడియో ద్వారా అందరికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన కాసేపటికే శ్రీముఖి సోషల్ మీడియాలోని ఆమె ఖాతాలోకి ఒక వీడియో పోస్ట్ అయ్యింది. దీని ప్రకారం తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నట్లుగా చెప్పటమే కాదు.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తానీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోలేదని స్పష్టం చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి పదమూడో కంటెస్టెంట్ గా వెళ్లిన శ్రీముఖి టాలెంట్ కు అద్దం పట్టేలా తాజా వీడియో ఉందని చెప్పాలి.

తానీ వీడియో విడుదల చేసే సమయానికి ఎపిసోడ్ ఎయిర్ అయిపోయి ఉంటుందని.. మీ అందరిని బోలెడంత ఎంటర్ టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నట్లుగా పేర్కొంది. ఇప్పటివరకూ ఎలా అయితే సపోర్ట్ చేశారో.. ఇక ముందు కూడా అదే తీరులో ఆదరించాలని ఆమె కోరారు. మొత్తానికి తనను అభిమానించే అభిమానుల్ని తాను మర్చిపోలేనన్న సందేశాన్ని ఇవ్వటమే కాదు.. మీ మద్దతు చాలా అవసరం సుమి అన్న చందంగా.. తన ఫ్యాన్ క్లబ్ ను తన తాజా వీడియో సందేశంతో అలెర్ట్ చేసిన శ్రీముఖి తెలివిని చూస్తే.. అమ్మడు మస్తు ప్లానింగ్ లో ఉన్నదన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
Please Read Disclaimer