‘బట్టలు ఊడపీక్కుంటేనే ఫ్యాషనా.. సుమ, ఝాన్సీలు అదే చేస్తున్నారా’?

0

మహిళల వస్త్రధారణపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఫ్యాషన్ పేరుతో ఒంటిపై ఉన్న బట్టల సైజ్‌ అంగుళాల లెక్కలకు చేరుతోంది. అయితే మేం విప్పుకుంటే మీకేం.. చూసే కళ్లు మంచివి కాకపోతే ఆరుగజాల చీర కట్టుకున్నా కామంతోనే చూస్తారంటూ వాదించేవారు ఉన్నారు. అయితే మహిళల వస్త్రధారణపై వివాదాస్పద కామెంట్స్ చేశారు ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి.

శ్వేతా రెడ్డి యూట్యూబ్ ఛానల్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘నేను బట్టల గురించి మాట్లాడితే.. అలా మాట్లాడింది.. ఇలా మాట్లాడింది అంటారు.. ఏ బట్టలు నిండుగా వేసుకుంటే తప్పేంటి? ఇప్పుడు ఎంత చింపుకుంటే అంత ఫ్యాషన్. అక్కడ డిజైనర్స్ ఏం చేస్తారో నాకు తెలుసు. కప్పుకుంటూ ఫ్యాషన్‌గా ఉండలేమా? చింపుకుంటేనే ఫ్యాషనా?

సుమ, ఝాన్సీ ఫ్యాషన్‌‌గానే ఉన్నారుగా.. బట్టలు పీక్కోవడం లేదే!
తొడలు, బొడ్డు చూపిస్తేనే ఫ్యాషన్ అంటే ఎలా? ఎక్స్ పోజింగ్ మాత్రమే ఫ్యాషన్ అంటే నేను ఒప్పుకోను. యాంకర్ సుమ, ఝాన్సీ వాళ్లు ఫ్యాషన్‌గా ఉండరా? వాళ్లు ఎంత నీట్‌గా ఎంత హుందాగా ఉంటారు. టాప్ యాంకర్‌లుగా ఉన్న వాళ్లు ఫ్యాషన్‌గా ఉండాలని బట్టలు ఊడపీక్కోవడం లేదు కదా.. మీకు ఎవరు చెప్పారు.. బట్టలు ఊడపీక్కుంటేనే ఫ్యాషన్ అని. కాస్త పద్దతిగా ఉండాల్సిన బాధ్యత అమ్మాయిలకు లేదా? అంటూ ప్రశ్నించారు శ్వేతారెడ్డి.
Please Read Disclaimer