యాంకర్ శ్యామల కోడి కూర.. ఈ ‘లవ్ చికెన్ ఫ్రై’ వెనుక పెద్ద కథే ఉంది

0

ఈ మధ్యనే సొంత యూట్యూబ్ ఛానల్‌ని ఓపెన్ చేశారు యాంకర్ శ్యామల. తన ఛానల్ ద్వారా కొత్త కొత్త ఐడియాలను యూట్యూబ్‌లో వర్కౌట్ చేసి క్యాష్ చేసుకుంటుంది. తన ఛానల్‌ను ఫాలో అవుతూ ఆమె ఆడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే తనను డైరెక్ట్‌గా కలిసే అవకాశం ఇవ్వడంతోపాటు .. తన బర్త్ డే నాడు తనతో కలిసి లంచ్ చేసే అవకాశాన్ని కల్పించింది శ్యామల.

మొత్తంగా తన ఛానల్‌ ప్రమోషన్స్ కోసం ఇలాంటి ట్రిక్స్ చాలానే ఉన్నాయి ఆమె దగ్గర తాజాగా తనకు వచ్చిన వంటల్ని సైతం యూట్యూబ్‌లో పెట్టి ఘుమఘమలాడిస్తోంది.

ఇంతకీ శ్యామల యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే.. ‘ఏం చెప్పారు శ్యామల గారూ’. ఇన్నాళ్లు ఏదోటి చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసిన శ్యామలకు ఇలా చెప్పడం వర్కౌట్ కాకపోవడంతో చేయడం మొదలుపెట్టారు.

ఇక చెప్పేది లేదు.. నాకు వచ్చిన విద్యను చూపించడమే అంటూ గరిటె పట్టి వంటగదిలో దర్శనం ఇచ్చింది. ఇక తాను తడిబట్టలతో మడికట్టుకుని వంట చేసే పక్కా వెజిటేరియన్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ.. తన భర్త కోసం చికెన్ నేర్చుకున్నా అంటోంది. అతనికి చికెన్ ఇష్టం కావడంతో అతన్ని ఇంప్రెస్ చేయడానికి చికెన్ చేయడం నేర్చుకున్నానని. వాళ్ల అమ్మ ఇంట్లో లేని సమయంలో తన భర్తని (అప్పటి ప్రియుడు) భోజనానికి పిలిచి చికెన్ పెట్టానంటూ చెప్పుకొచ్చింది. అలా తన కోసం చికెన్ వండిన శ్యామలను చూసి తన భర్త అప్పట్లో ప్లాట్ అయిపోయాడని నాటి కోడి కూర కహాని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ కోడికూరకు ‘లవ్ చెకెన్ ఫ్రై’ అనే పేరుకూడా పెట్టేసింది శ్యామల. తను కష్టపడి కోడికూర చేసినా… ఉప్పు చూడటానికి కూడా టేస్ట్ చేయదట. మరి ఆమె నేర్చుకున్న చికెన్ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి.
Please Read Disclaimer