బికినీలో వేడెక్కిస్తున్న బుల్లితెర యాంకర్

0

తెలుగమ్మాయిలు కథానాయికలుగా రాణిస్తున్న రోజులివి. మునుపటితో పోలిస్తే బుల్లితెర వెండితెరపై తెలుగమ్మాయిల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా కళారంగంలోకి దూసుకొచ్చి తమకంటూ ఒక సపరేట్ రూట్ ఉందని నిరూపిస్తున్నారు.

ఇక బుల్లితెర యాంకర్లు అయితే కాస్త అడ్వాన్స్ డ్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో చెలరేగుతున్నారు. అనసూయ- రేష్మి- శ్రీముఖి-మంజూష లాంటి యాంకర్లు గ్లామర్ సరిహద్దుల్ని చెరిపేసి హాట్ ఫోటోషూట్లతో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇదే కేటగిరీలో మరో బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా ఇటీవల అంతకంతకు వేడి పెంచేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది.

ఈటీవీ2 లో ఫన్ కార్యక్రమాలు సహా పలు బుల్లితెర కార్యక్రమాల్లోనూ వర్షిణి కనిపిస్తోంది. ఢీ నుంచి బయటికి వచ్చాక.. ప్రస్తుతం వర్షిణి సౌందరాజన్ స్టార్ మాలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ భామ లేటెస్ట్ బికినీ షూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా వర్షిణి ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లోనూ ఈ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. బికినీలో వర్షిణి లుక్ చూశాక సినీతారగానూ ఓ వెలుగు వెలుగుతుందంటూ అభిమానులు ఊహిస్తున్నారు. ఇక దర్శకనిర్మాతలు ఈ భామకు ఆఫర్లు ఇవ్వడమే ఆలస్యం.