కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన ప్రముఖ యాంకర్..!

0

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను ‘కాస్టింగ్ కౌచ్’ మరియు ‘మీటూ’ ఉద్యమాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో వేధింపులు సర్వసాధారణమంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. కొందరైతే ఆ దర్శక నిర్మాతల పేర్లను డైరెక్టుగా బయట పట్టేశారు. మరికొందరు ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు నటీమణులు కూడా ఈ విషయంపై చాలా సందర్భాలలో స్పందించారు. అయితే ఈ సమస్య ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాకూండా టీవీ ఇండస్ట్రీలోనూ ఉందని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా యాంకర్ వర్షిణి కూడా ‘కాస్టింగ్ కౌచ్’ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

యాంకర్ వర్షిణి ఈ మధ్య బుల్లితెరపై పలు షోలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తాజాగా వర్షిణి తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు వెల్లడించింది. “ఓ వెబ్ సిరీస్ ఆఫర్ వస్తే వెళ్లి దర్శకుడ్ని కలిశాను. కాసేపు నాతో బాగానే మాట్లాడిన అతను కొద్దిసేపటి తర్వాత నాతో తప్పుగా బిహేవ్ చేశాడు. ఇది రీసెంట్ గానే జరిగింది. లాక్ డౌన్ కు ముందు నాకు ఇది ఎదురైంది. అతడు నా చేయి పట్టుకొని లాగాడు. నేను వెంటనే బయటకి వచ్చేసాను. కారులో కూర్చొని ఏడ్చాను. నా కెరీర్ లో చేదు అనుభవం ఇదొక్కటే. ఎప్పడూ నాకు అలా జరగలేదు” అని వర్షిణి చెప్పుకొచ్చింది. ఆ చేదు అనుభవాన్ని తన తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేకపోయానని.. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రం చెప్పుకొని ఏడ్చానని వర్షిణి చెప్పుకొచ్చింది.